Begin typing your search above and press return to search.

భ‌ర్త‌ను పెనంతో త‌ల‌పై పెనంతో బాదాల‌నుకున్నా న‌టి?

అయితే మాజీ భార్య‌తో సైఫ్ ఖాన్ బ్రేక‌ప్ కి కార‌ణం 'అనుమాన భూతం'. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు అయ్యేవి. ఒకానొక సంద‌ర్భంలో సైఫ్ త‌ల‌పై మొద‌టి భార్య పెనంతో బాదాల‌నుకున్నార‌ట‌.

By:  Tupaki Desk   |   26 Dec 2024 2:30 AM GMT
భ‌ర్త‌ను పెనంతో త‌ల‌పై పెనంతో బాదాల‌నుకున్నా న‌టి?
X

ఆదిపురుష్ - దేవ‌ర చిత్రాల‌తో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం అయ్యాడు. సౌత్ లో నెగెటివ్ పాత్ర‌ల్లో న‌టిస్తున్న సైఫ్ ఖాన్ హిందీ చిత్ర‌సీమ‌లోని అగ్ర హీరోల్లో ఒక‌డిగా సుప‌రిచితుడు. అత‌డి మొద‌టి వివాహం బ్రేక‌ప్ అయ్యాక‌, న‌టి క‌రీనా కపూర్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే మాజీ భార్య‌తో సైఫ్ ఖాన్ బ్రేక‌ప్ కి కార‌ణం 'అనుమాన భూతం'. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు అయ్యేవి. ఒకానొక సంద‌ర్భంలో సైఫ్ త‌ల‌పై మొద‌టి భార్య పెనంతో బాదాల‌నుకున్నార‌ట‌.

సైఫ్ అలీ ఖాన్ మొద‌టిసారి నటి అమృతా సింగ్‌ను 1991లో వివాహం చేసుకున్నారు. అయితే 2004లో ఇద్దరూ విడిపోయారు. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు. అయితే సైఫ్‌-అమృత క‌ల‌త‌ల కార‌ణంగా విడిపోయారు. తన భర్త తనను మోసం చేయలేదని నిర్ధారించుకోవడానికి అత‌డిని అమృత‌ సీక్రెట్ గా వెంబ‌డించేద‌ట‌.

సైఫ్ ఔట్ డోర్ షూటింగుల‌కు వెళ్లిన‌ప్పుడు అత‌డికి కాప‌లాగా వెళ్లారా? అని అమృత‌ను ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్ర‌శ్నించ‌గా, అలా చేయ‌డం అవ‌మానక‌రం. మ‌గాళ్ల‌కు కాప‌లా కుక్క‌గా వెళ్లాలా? ఒక‌వేళ వెళ్లినా ఏమీ జ‌ర‌గ‌ద‌ని న‌మ్మాలా? అని అమృత ప్ర‌శ్నించారు. ఏం చేసినా జ‌రిగేది జ‌ర‌గ‌క మానదు.. మ‌గాళ్ల‌ను ఆప‌లేమ‌ని అమృత ప‌రోక్షంగా అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో సైఫ్ తో వాదోపవాదాలు కొట్లాట‌ల గురించి కూడా అమృత మాట్లాడారు. మా మ‌ధ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఫైటింగులు చేసాము. స్త్రీకి అభద్రతాభావం కలగడం సహజమని నేను భావిస్తున్నాను. నేను ఏడ్చి పోరాడాను.. ఏ స్త్రీ అయినా చేయగ‌లిగే సాధారణ పనులన్నీ నేను కూడా చేసాను. నేను సైఫ్ తలను ఫ్రైయింగ్ పాన్‌(వేపుడు చేసే పెనం)తో కొట్టాలనుకున్నాను.. అని తెలిపింది.

మొద‌టి భార్య నుంచి విడిపోయినా కానీ సైఫ్ ఆమెతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇద్ద‌రు పిల్ల‌లు సారా అలీఖాన్, ఇబ్ర‌హీం అలీఖాన్ లు సినీరంగంలో తార‌లుగా కొన‌సాగుతున్నారు. సారా క‌థానాయిక‌గా ఎదిగేస్తుండ‌గా, ఇబ్ర‌హీం తొలి చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది. రెండో భార్య‌ క‌రీనాతో సైఫ్ కి ఇద్దరు కుమారులు.. తైమూర్ అలీ ఖాన్ - జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. సైఫ్ కి మొత్తంగా న‌లుగురు వార‌సులు ఉన్నారు. వారంతా ప‌టౌడీ సంస్థానం వార‌సులు.