హీరోయిన్ గొంతు నొక్కేస్తోన్న డైరెక్టర్లు!
చెన్నై బ్యూటీ అమృత అయ్యర్ సుపరిచితమే. `రెడ్`, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా`, `అర్జునా పాల్గుణ` లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి అమృతకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
By: Tupaki Desk | 12 Dec 2024 6:30 PM GMTచెన్నై బ్యూటీ అమృత అయ్యర్ సుపరిచితమే. `రెడ్`, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా`, `అర్జునా పాల్గుణ` లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి అమృతకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ `హనుమాన్` తో మాత్రం పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అందులో తేజ సజ్జాకు జోడీగా నటించిన అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం `బచ్చలమల్లి` అనే చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ అమ్మడికి తెలుగు వచ్చినా ఇక్కడ దర్శకులు సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని అంటోంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమృత కొన్ని విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే...` చేసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లదు. హనుమాన్ కూడా ముందు తెలుగు సినిమాలాగే మొదలు పెట్టాం. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. హనుమాన్ తర్వాత కూడా కథల ఎంపిక పరంగా ఇదివరకటి లాగే జాగ్రత్తలు తీసుకుం టున్నా. డ్రీమ్ గాళ్, యువ రాణి తరహా పాత్రలు చేయాలని ఉంది. పొన్నియన్ సెల్వన్ చూసాక ఆ కోరిక మరింత పెరిగింది.
యాక్షన్ ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నా. సొంతంగా డబ్బింగ్ చెప్పగలను. కానీ దర్శకులు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అని అడిగితే నీ వాయిస్ చిన్న పిల్ల మాట్లాడినట్లు ఉంటుందంటున్నారు. అలాంటి వాయిస్ తో డబ్బింగ్ చెబితే పాత్ర కు నాన్ సింక్ అవుతుందని అంటున్నారు. అలా డబ్బింగ్ చెప్పే అవకాశం కోల్పోతున్నా` అంది.
ప్రస్తుతం అమృత అయ్యర్ వయసు 30 ఏళ్లు. అయినా అమ్మడి వయసు ఇంకా చిన్న పిల్లలా ఉందంటే? కొందరి గొంతులో మార్పులు రావు. అలా అమృత గొంతులోనూ మార్పు రాలేదు. ఈ అమ్మడు తెలుగు కంటే ముందు కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసింది. ఈ రెండు భాషల కంటే ముందు మాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ నటిగా కొనసాగలేదు.