Begin typing your search above and press return to search.

ఏంటి వీళ్లు అమృతం సీరియల్ లో ఉన్నారా..?

అమృతం సీరియల్ లో 12వ ఎపిసోడ్ లో చిన్న పిల్లల ఎపిసోడ్ ఒకటి వచ్చింది. అందులో కాళ భైరవ, శ్రీ సింహా ఉన్నారు. ఐతే అప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 12:30 PM GMT
ఏంటి వీళ్లు అమృతం సీరియల్ లో ఉన్నారా..?
X

కీరవాణి తనయులు ఇద్దరు కూడా సినిమాల్లోకి వచ్చారు. పెద్ద కొడుకు కాళ భైరవ కీరవాణి వారసత్వాన్ని అందుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తుండగా శ్రీ సింహా హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఈ ఇద్దరు సినిమాల్లోకి రాక ముందు సూపర్ హిట్ సీరియల్ అమృతంలో నటించారు. అమృతం సీరియల్ అంటే ఈ తరం యువతకు తెలియకపోవచ్చు కానీ అప్పట్లో జస్ట్ ఎల్లో మీడియా గుణ్ణం గంగరాజు తీసిన అమృతం బ్లాక్ బస్టర్ హిట్. ఆయన నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు.

అప్పట్లో అమృతం సీరియల్ అందరికీ ఫేవరెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే అమృతం సీరియ లో కీరవాణి తనయులిద్దరు కనిపించారు. అమృతం సీరియల్ లో 12వ ఎపిసోడ్ లో చిన్న పిల్లల ఎపిసోడ్ ఒకటి వచ్చింది. అందులో కాళ భైరవ, శ్రీ సింహా ఉన్నారు. ఐతే అప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. శ్రీ సింహా నటించిన మత్తు వదలరా 2 సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా ప్రమోషన్స్ లో శ్రీ సింహా, కాళ భైరవ ఇద్దరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. కాళ భైరవ, శ్రీ సింహా చిన్నప్పుడు ఎలా ఉన్నారో పెద్దయ్యాక కూడా అలానే ఉన్నారు. శ్రీ సింహా హీరోగా తన సత్తా చాటాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాళ భైరవ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా మెప్పిస్తూ వస్తున్నారు.

కీరవాణి తనయులిద్దరినీ పరిశ్రమలోనే సెటిల్ చేసేలా చూస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శ్రీ సింహాకు ఫ్యూచర్ లో ఏదైనా మంచి ఛాన్స్ ఇస్తాడని చెప్పొచ్చు. ఇదే క్రమంలో కాళ భైరవతో కూడా జక్కన్న పనిచేసే అవకాశం లేకపోలేదు. నెక్స్ట్ బిగ్ స్టార్స్ అయ్యేందుకు అన్ని క్వాలిటీస్ తమలో ఉన్నాయని ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఇద్దరు. మరి వీరిని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి. శ్రీ సింహా లేటేస్ట్ రిలీజ్ మత్తువదలరా 2 అయితే సత్య కామీడీ మీద నడిపించేశారు. సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మత్తు వదలరా సీక్వెల్ గా మత్తువదలరా 2 చేశారు కాబట్టి ఈ సీక్వెల్ ఇలానే కొనసాగుతుందేమో చూడాలి.