ప్రియుడితో ఎమీజాక్సన్ నిమ్మచెట్టు కింద సరాగాలు!
2.0 - ఐ లాంటి భారీ చిత్రాల్లో నటించిన ఎమీజాక్సన్ తెలుగులో `ఎవడు?` చిత్రంలో నటించింది.
By: Tupaki Desk | 11 Oct 2024 3:00 AM GMT2.0 - ఐ లాంటి భారీ చిత్రాల్లో నటించిన ఎమీజాక్సన్ తెలుగులో `ఎవడు?` చిత్రంలో నటించింది. భారతదేశంలో అగ్ర నటిగా హోదా అందుకున్నా కానీ వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యేందుకు నటనకు గ్యాప్ ఇచ్చింది. అప్పట్లో ఇంగ్లండ్ కి చెందిన బిలియనీర్ జార్జి పనాయటౌతో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమకు చిహ్నంగా ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత ఈ జంట బ్రేకప్ అయింది.
అటుపై నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో ప్రేమలో పడిన ఎమీజాక్సన్ ఇటీవలే అతడిని పెళ్లాడింది. ఓ ఇంటర్వ్యూలో, అమీ తన కొడుకు ఆండ్రియాస్ ఎడ్‌తో తన సంబంధానికి ఓకే చెప్పాడని మురిసిపోయింది. మరోవైపు ఎమీజాక్సన్ నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ, ప్రకటనల్లో నటిస్తూ బాగానే ఆర్జిస్తోంది.
తాజాగా ఎమీజాక్సన్ తన భర్త ఎడ్ వెస్ట్ విక్ తో రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పటి అరుదైన ఓ ఫోటోని షేర్ చేసింది. ఎడ్ నిజంగా ఎంతటి సరసుడో చెప్పేందుకు ఇంతకంటే గొప్ప ఫోటోగ్రాఫ్ మరొకటి అవసరం లేదు. ఎమీజాక్సన్ లాంటి అందగత్తెతో రొమాంటిక్ లైఫ్ ని అతడు జాయ్ రైడ్ లా లాగించేస్తున్నాడు. కొంచెం బోల్డ్ గా ఉన్న ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ఎమీ ఎంతో స్టైలిష్ గా బ్లాక్ షేడ్స్ ధరించి కనిపించింది. ఎడ్ చాలా సింపుల్ గా కాటన్ బ్లెండ్ దుస్తుల్లో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. లవ్ అండర్ ది లెమన్ ట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.