వైరల్ వీడియో: బేబి బంప్‌తో ఎమీజాక్సన్ ఫోజులు
అటుపై మోడల్ కం నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో రెండోసారి ఎమీ ప్రేమలో పడింది.
By: Tupaki Desk | 24 Feb 2025 3:49 AM GMTఎమీ జాక్సన్ .. పరిచయం అవసరం లేదు. భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఏలింది. ప్రస్తుతం లండన్ లో నివశిస్తోంది. బ్రిటన్ కి చెందిన బిలియనీర్ జార్జి పనాయటౌతో డేటింగ్ చేసిన ఎమీ జాక్సన్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జార్జితో అనూహ్యంగా బ్రేకప్ అయింది. అటుపై మోడల్ కం నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో రెండోసారి ఎమీ ప్రేమలో పడింది. ఎడ్ తో మొదటి బిడ్డకు జన్మనిస్తున్నానని ఇంతకుముందే ప్రకటించింది.
తాజాగా తన బేబి బంప్ వీడియోను ఎమీజాక్సన్ షేర్ చేసింది. విలాసాల భవంతిలో ఎమీ రాకుమారిలా విలాసాలను ఆస్వాధిస్తోంది. డబుల్ పోర్షన్స్ ఎట్ దిస్ పాయింట్! అంటూ ఎంతో చిద్విలాసంగా ఎమీజాక్సన్ కనిపించింది ఈ వీడియోలో. ఈ భామ ఇటీవల లండన్ లో జరిగిన బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ వార్షిక గాలా విందు లో తన భర్త వెస్ట్ విక్ తో కలిసి సందడి చేసింది. ఇదే పార్టీలో అభిషేక్ బచ్చన్ కూడా అతిథిగా పాల్గొన్నాడు. పార్టీ నుంచి ఫోటోలు వైరల్ గా షేర్ అయ్యాయి.
`గాసిప్ గర్ల్` షోలో చక్ బాస్ పాత్రతో పాపులరైన నటుడు ఎడ్ వెస్ట్‌విక్ మూడేళ్ల పాటు ఎమీజాక్సన్ తో డేటింగ్ చేసాక పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవలే ఎడ్ వెస్ట్ విక్ ముంబై విమానాశ్రయంలో కూడా కనిపించాడు. ఆ సమయంలో ఎమీజాక్సన్ అతడితో కనిపించలేదు. బహుశా ఫ్రెగ్నెన్సీ కారణంగా ఎమీ ప్రయాణాలు చేయడం లేదు. వెస్ట్ విక్ నిన్న జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ని వీక్షించబోతున్నానని కూడా చెప్పాడు. ఇక ఎమీ-ఎడ్ వెస్ట్ విక్ జంట అన్యోన్యత అభిమానుల్లో చర్చగా మారింది. అప్పటికే వేరొకరితో ఒక బిడ్డకు తల్లి అయిన ఎమీ జాక్సన్ తో ఎడ్ ప్రేమలో పడ్డాడు. ఎమీని ఎడ్ అమితంగా ఆరాధిస్తాడు. ఈ ప్రేమ జంట గోల్స్ అందరికీ స్ఫూర్తి.