వీడియో: బేబి బంప్‌తో ఎమీ జాక్సన్ ఊహించని ట్విస్ట్
బేబి బంప్ ని ప్రదర్శిస్తూనే క్యాట్ వాక్ లలో తగ్గేదేలే అంటోంది ఎమీజాక్సన్. గర్భవతి అయిన అమీ జాక్సన్ తన బేబీ బంప్‌ను స్ట్రైకింగ్ లో-కట్ గౌనులో అద్భుతంగా ప్రదర్శించింది.
By: Tupaki Desk | 4 Dec 2024 4:11 AM GMTరూల్స్ బ్రేక్ చేస్తూ కొత్తగా ఏదైనా చేయడంలోనే ఉంది మజా! అలాంటి మజాను ఆస్వాధించడంలో బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ తర్వాతే ఇంకెవరైనా. లండన్ కి చెందిన మల్టీ బిలియనీర్ జార్జి పనాయటౌతో ప్రేమాయణం సాగించి, అతడితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలోనే బిలియనీర్‌తో బ్రేకప్ ప్రకటించడం.. ఆ తర్వాతా రెండోసారి లవ్ లో పడటం.. అతడితో రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవ్వడం... ఇవన్నీ చూస్తుంటే.. జీవితం ఎంత స్పీడ్ గా ప్రయాణిస్తుందో ఎమీజాక్సన్ జీవన శైలిని చూసి సగటు మనిషి అర్థం చేసుకోవచ్చు.
గర్భిణి అయినంత మాత్రాన ఫ్యాషన్ షోలు వదిలేస్తుంది! అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇదిగో చూశారు కదా...! బేబి బంప్ ని ప్రదర్శిస్తూనే క్యాట్ వాక్ లలో తగ్గేదేలే అంటోంది ఎమీజాక్సన్. గర్భవతి అయిన అమీ జాక్సన్ తన బేబీ బంప్‌ను స్ట్రైకింగ్ లో-కట్ గౌనులో అద్భుతంగా ప్రదర్శించింది. ది ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరయిన అమీ జాక్సన్ తన బేబీ బంప్‌ను ప్రదర్శించేందుకు అస్సలు వెనకాడలేదు. లో-కట్ గౌనులో మెటర్నిటీ ఫ్యాషన్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆకర్షించే గౌను.. హెయిర్‌డో, ఎత్తైన పోనీటైల్‌తో ఎమీజాక్సన్ స్టైల్ ఫ్యాషన్ కంటెంట్ అమితంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఎమీ జాక్సన్ 2024 ఆగస్ట్‌లో స్టార్ ఎడ్ వెస్ట్‌విక్ ని పెళ్లాడింది. రెండు నెలల తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం వేచి చూస్తున్నట్టు ప్రకటించారు. జాక్సన్ తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
బ్రిటీష్ నటి ఎమీజాక్సన్ తన భర్త ఎడ్ వెస్ట్‌విక్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. తనకు ఇప్పటికే ఐదేళ్ల కొడుకు ఆండ్రియాస్ ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన భారీ ఈవెంట్‌లోను ఎమీ క్యాట్ వాక్ లు చేసింది.