హాలీవుడ్ నటుడితో అమీజాక్సన్ ధాంపత్య జీవితంలోకి!
అయితే తాజాగా అమ్మడు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ని వివాహం చేసుకుంది.
By: Tupaki Desk | 26 Aug 2024 7:05 AM GMTబ్రిటన్ బ్యూటీ జాక్సన్ గురించి పరిచయం అసవరం లేదు. ఎవడు, ఐ, 2.ఓ సినిమాలతో ఎంతో ఫేమస్ అయిన బ్యూటీ. టాప్ స్టార్ లతో నటించినా అమ్మడి కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో అమీ ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోయింది. అటుపై జార్జ్ పనియోట్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం చేసారు. ఫలితంగా ఆండ్రూ అనూ బాబు జన్మించాడు. కానీ వివాహం మాత్రం చేసుకోలేదు.
అటుపై మనస్పర్దలు రావడంతో దూరమయ్యారు. ఆ తర్వాత కొంత కాలం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేసింది. అయితే తాజాగా అమ్మడు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరు కూడా కొంత కాలం ప్రేమించుకున్నారు. ఇప్పుడా వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. వివాహం ఇటలీలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొత్త దంపతులకు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. వెడ్డింగ్ పిక్స్ ను అమీ జాక్సన్ పోస్ట్ చేస్తూ.. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. ఇక అమీ జాక్సన్ ఆరేళ్ల తర్వాత మళ్లీ కంబ్యాక్ అయింది. ఈ ఏడాది అమ్మడు నటించిన తమిళ, హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందు కొచ్చాయి. `మిషన్ చాప్టర్ వన్` అనే తమిళ సినిమా చేసింది. అది జనవరిలో రిలీజ్ అయింది.
అలాగే `క్రాక్` అనే హిందీ సినిమాలోనూ నటించింది. కానీ రెండు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి వివాహం తర్వాత కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాలి. భర్త హాలీవుడ్ నటుడు కాబట్టి అక్కడ ప్రయత్నాలు చేస్తుందా? అన్నది చూడాలి. ఇంతవరకూ అమ్మడు హాలీవుడ్ సినిమాలు చేసింది లేదు.