Begin typing your search above and press return to search.

కుబేర.. కమ్ముల కంటెంట్ పోస్టర్

ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కూడా ప్రేక్షకులలో మంచి ఆసక్తిని బాగా పెంచాయి.

By:  Tupaki Desk   |   7 Sep 2024 9:24 AM GMT
కుబేర.. కమ్ముల కంటెంట్ పోస్టర్
X

ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా కుబేర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రష్మిక మందన్న కూడా ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కూడా ప్రేక్షకులలో మంచి ఆసక్తిని బాగా పెంచాయి.


కాగా, వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం ధనుష్, నాగార్జున ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్‌లో ధనుష్, నాగార్జున పాత్రల మధ్య ఉన్న విభిన్నతలు స్పష్టంగా చూపించబడ్డాయి. ధనుష్ పాత్ర ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుండగా, అతని వేషధారణ చాలా గందరగోళంగా ఉంది.

పెద్ద గడ్డం, జుట్టు పూర్తిగా ఒక బిచ్చగాడిగా ఉంటూ, అతని పాత్ర కష్టాల్లో నిండి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. మరొకవైపు నాగార్జున పాత్రకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సూటు ధరించి, సంపన్నమైన లుక్ తో నాగార్జున పాత్ర ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల భిన్నతలు సినిమాలోని కంటెంట్‌ను మరో కోణంలో చూపిస్తున్నాయి.

ఇదివరకే పాత్రలకు సంబంధించిన టీజర్స్ ను కూడా విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. జిమ్ సార్భ్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

కుబేర సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విభిన్నమైన భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన ప్రొఫెషనల్ టచ్‌తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.