అత్తమ్మ అంచనాలు అందుకోలేని అల్లుడు సచిన్!
అయితే తాజాగా ఓ పుస్తకంలో సచిన్ టెండూల్కర్ గురించి అత్త అనాబెల్ మెహతా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 12 Aug 2024 6:22 AM GMTసచిన్ టెండూల్కర్- అంజలి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సచిన్ కన్నా అంజలి అరేళ్లు వయసులో పెద్దది. కానీ ప్రేమకి వయసుతో సంబంధం లేదని ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ అందమైన జంటకు ఇద్దరు పిల్లలు కలరు. వాళ్లు ఎవరి వృత్తుల్లో వారు బిజీగా ఉన్నారు. సచిన్ కుమారుడు అర్జున్ బౌలర్ గా రాణిస్తున్నాడు.
కుమార్తె సారా టెండూల్కర్ మాస్టర్స్ పూర్తి చేసింది. ఇదీ సచిన్ ఫ్యామిలీ. అయితే తాజాగా ఓ పుస్తకంలో సచిన్ టెండూల్కర్ గురించి అత్త అనాబెల్ మెహతా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవి ఏంటో ఆమె మాటల్లోనే.. ' అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకున్నా. దీంతో అతడిని చూడాలని నాకు ఆశ మొదలైంది. అతడి మంచి హైట్ ఉంటాడనని నాలో నేను ఆరడగులు ఉంటాడని ఊహించుకున్నా.
చాలా అందంగా ఉంటాడని హోప్స్ పెట్టుకున్నా. తీరా సచిన్ ని చూసి షాక్ అయ్యా. పొట్టిగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించాడు. అంజలి హీల్స్ వేసుకుంటే ఆమె ఎత్తు కూడా ఉండడు. నిశ్చితార్దం అయ్యాక దొంగచాటుగా మా ఇంటికి వచ్చేవాడు' అని మై పాసేజ్ టూ ఇండియా పుస్తకంలో పేర్కొన్నారు.ఇక సచిన్ హైట్ అంజలి హైట్ కన్నా ఎక్కువే. సచిన్ 1.65 ఉండగా, అంజలి 1.63 ఉన్నారు. అంజలి హీల్స్ వేసుకుంటే సచిన్ పొట్టిగానే కనిపిస్తాడు. వేసుకోకపోతే బ్యాలెన్సింగ్ అవుతుంది.
1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం న్యూజిలాండ్‌లో జరిగింది. ఆ తర్వాత 1995 మే 24న పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితానికి 30 ఏళ్లు దాటింది. ఇప్పటికీ అదే ఉత్సాహంతో అభిమానుల్ని అలరిస్తుంటారు. ఇండియా మ్యాచ్ లకు జంటగా హాజరవుతుంటారు. సోషల్ మీడియాలోనూ అభిమానులకు టచ్ లో ఉంటారు.