అనాధా పిల్లలతో పవన్ సతీమణి క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2023 4:23 AM GMTజనసేన అధ్యక్షులు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.
తమ విలువైన సమయాన్ని వెచ్చించి అన్నా చాలాసేపు పిల్లలతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. పిల్లలంతా ఈ పండగ వేళ అనా కొణిదెలతో కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. శ్రీమతి అనా కొణిదెలను హోమ్ నిర్వాహకులు సత్కరించారు.
ధాతృసేవల్లో ఎప్పుడూ ముందుండే పవన్ కల్యాణ్ పలువురికి ఉదారంగా డొనేషన్లు అందజేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో ఆయన సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకుడిగాను ప్రజల్లో ఉంటూ వారికి అవసరమైన సేవలను సహాయసహకారాల్ని అందజేస్తున్నారు. పవన్ బాటలోనే ఆయన సతీమణి అనా కొణిదెల సేవాకార్యక్రమాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తారు.