Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'వార్‌'... అనల్ అరసు సూపర్‌ అప్డేట్‌

తాజాగా అనల్ అరసు మాట్లాడుతూ... సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశంలో హృతిక్‌ రోషన్ మరియు ఎన్టీఆర్‌ లు ఉంటారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 7:17 AM GMT
ఎన్టీఆర్‌ వార్‌... అనల్ అరసు సూపర్‌ అప్డేట్‌
X

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిని మించి గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్‌ కి మంచి గుర్తింపు లభించింది. అందుకే ఆయన్ను హిందీ సినిమాల్లో నటింపజేస్తే మంచి ఫలితం వస్తుందనే ఉద్దేశ్యంతో పలువురు నిర్మాతలు ఆయనను సంప్రదించారు.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న గూఢచారి సినిమా వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్‌ స్క్రీన్ షేర్‌ చేసుకోబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వార్ 2 గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్ అనల్‌ అరసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్‌, హృతిక్ ల మధ్య పోరాట సన్నివేశాలు ఉంటాయా? లేదా? అనే చర్చ జరుగుతుంది.

తాజాగా అనల్ అరసు మాట్లాడుతూ... సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశంలో హృతిక్‌ రోషన్ మరియు ఎన్టీఆర్‌ లు ఉంటారు. ఆ ఫైట్‌ ను నేను కంపోజ్‌ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేసే విధంగా వార్ 2 యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని హామీ ఇచ్చాడు.

దేవర సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి అవ్వకుండానే వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు. వచ్చే నెలలో వార్ 2 కొత్త షెడ్యూల్‌ కోసం మళ్లీ ముంబై వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ నటించేందుకు రెడీ అవుతున్నాడు.