హిట్ దర్శకుడితో దేవరకొండ మూవీ క్యాన్సల్ అయినట్లేనా?
ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వచ్చిన 'బేబీ' సినిమా ఎంతటి విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 28 Dec 2024 5:29 AM GMTఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వచ్చిన 'బేబీ' సినిమా ఎంతటి విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఆ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో సైతం రీమేక్‌కి సిద్దం అయిన బేబీ కాంబోలో మరో తెలుగు సినిమా రాబోతుంది అంటూ గతంలోనే ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ సైతం విడుదల అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సాయి రాజేష్ గతంలో ప్రకటించిన సినిమా కాకుండా ఇప్పుడు కొత్త సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందబోతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది ఆరంభంలో ఉంటాయని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరంకి జోడీగా హీరోయిన్ ఎంపిక చేసే పనిలో దర్శకుడు సాయి రాజేష్ ఉన్నాడు. వైష్ణవి చైతన్యను అనుకున్నప్పటికీ కథకు ఆమె సరి కాదని మరో హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు సాయి రాజేష్ భావిస్తున్నాడు.
ఈమధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా బేబీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి సాయి రాజేష్ దర్శకత్వంలోని సినిమాను ఆనంద్ దేవరకొండ వదులుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి, అసలు వీరిద్దరి కాంబోలో మూవీ పూర్తిగా క్యాన్సల్ అయ్యిందా లేదంటే కిరణ్ అబ్బవరంతో చేయబోతున్న సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండతో సినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. వీరిద్దరి కాంబోలో మరో బేబీ వంటి మంచి కమర్షియల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ వస్తుంది అనుకుంటే ఇలా అయ్యింది ఏంటి అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత సాయి రాజేష్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయన కిరణ్ అబ్బవరంతో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. కనుక ఆనంద్ దేవరకొండ సైతం మరో దర్శకుడితో వర్క్ చేసేందుకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్‌ల కాంబోలో మూవీ మళ్లీ ఉంటుందా లేదంటే పూర్తిగా ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందా తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆనంద్ దేవరకొండ సినిమాల ఎంపిక విషయంలో తొందర పడకుండా అన్నయ్య విజయ్ దేవరకొండ మాదిరిగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముందు ముందు ఆయన నుంచి పెద్ద సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని దేవరకొండ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.