Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ల‌వ్ ఫెయిల్యూర్ ఇలా

తాజాగా ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజు స‌మీపించిన వేళ యువ హీరో త‌న బ్రేక‌ప్ ల‌వ్ స్టోరీ గురించి రివీల్ చేసాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:51 AM GMT
యంగ్ హీరో ల‌వ్ ఫెయిల్యూర్ ఇలా
X

'బేబి' విజ‌యంతో యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ ఫాంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నిజానికి అతడి తొలి స‌క్సెస్ అదే అని చెప్పాలి. అంత‌కు ముందు మూడు..నాలుగు సినిమాలు చేసాడు గానీ అవేవి పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు అనే ఐడెంటిటీతో కొంత కాలం చ‌లామ‌ణీ అయిపోయాడు. కానీ బేబి స‌క్సెస్ తో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఆ స‌క్సెస్ వ‌రుస‌గా అవ‌కాశాలు తెచ్చి పెట్టింది.


ప్ర‌స్తుతం ఆ యంగ్ హీరో ఖాతాలో మూడు సినిమాలున్నాయి. అవ‌న్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇంకా కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జోరుగానే సాగుతున్నాయి. ఆ ర‌కంగా ఒక్క స‌క్సెస్ ఆనంద్ కెరీర్ నే మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ హీరో రెట్టించిన ఉత్సాహంలోనూ క‌నిపిస్తున్నాడు. తాజాగా ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజు స‌మీపించిన వేళ యువ హీరో త‌న బ్రేక‌ప్ ల‌వ్ స్టోరీ గురించి రివీల్ చేసాడు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా ఖండాలే దాటివెళ్లిన‌ట్లు తెలిపాడు.

ప్రియురాలు పై చ‌దువుల కోసం చికాగో వెళ్తే తాను కూడా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడుట‌. అక్క‌డే ఇద్ద‌రు క‌లిసి చ‌దువుకుంటే బాగుంటుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాడుట‌. అందుకోసం చికోగాలోని టాప్-5 ఇంజినీరింగ్ కాలేజీలకు దరఖాస్తు చేసుకుంటే ఓ దాంట్లో సీటు వ‌చ్చిందిట‌. కానీ అక్క‌డ వెళ్లాకే అస‌లు వాస్త‌వాలు తెలిసాయ‌ని ఎమోష‌న్ అయ్యాడు. త‌న ల‌వ్ స్టోరీ క‌థ అంతా అక్క‌డ అడ్డం తిరిగింద‌ని షాక్ ఇచ్చాడు.

అక్కడికెళ్లాక వ్యవహారం బెడిసికొట్టిందని తన గుండె పగిలిందని చెప్పుకొచ్చాడు. ఆ బ్రేక‌ప్ బాధ నుంచి బ‌య‌ట ప‌డేందుకు నాలుగైదేళ్లు ప‌ట్టిందిట‌. తాను నిజాయితీగా ప్రేమించినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని.. ఆసంఘ‌ట‌న వ్యక్తిగ‌తంగా త‌న‌ని..త‌న మ‌న‌సుని ఎంతో బాధ‌పెట్టింద‌ని అన్నాడు.