Begin typing your search above and press return to search.

బేబీ కంటిన్యూ అయ్యేనా ఆనంద్‌...?

అన్న ఇండస్ట్రీలో హిట్స్ కొట్టడంతో తమ్ముడు సాఫ్ట్‌ వేర్ వదిలి సినిమాల వైపు వచ్చాడు.

By:  Tupaki Desk   |   30 May 2024 3:00 AM GMT
బేబీ కంటిన్యూ అయ్యేనా ఆనంద్‌...?
X

విజయ్ దేవరకొండ సుదీర్ఘ కాలం స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ అందుకుని ఒక్కసారిగా యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలో మొదటి వరుసలో చోటు దక్కించుకున్నాడు. అన్న ఇండస్ట్రీలో హిట్స్ కొట్టడంతో తమ్ముడు సాఫ్ట్‌ వేర్ వదిలి సినిమాల వైపు వచ్చాడు.

ఆనంద్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాడు. బేబీ సినిమాతో ఆ మధ్య హిట్‌ ను అందుకున్న ఆనంద్‌ దేవరకొండ ఈ వారంలో గంగం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి, భజే వాయు వేగం సినిమాలతో పాటు ఈ గణేశా రాబోతున్నాడు.

బేబీ సినిమాలో ఆనంద్‌ దేవరకొండకు జోడీగా నటించిన వైష్ణవి చైతన్య తాజాగా లవ్‌ మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్‌ అయ్యింది. దాంతో బేబీ సక్సెస్ ను కనీసం ఆనంద్‌ దేవరకొండ అయినా కంటిన్యూ చేసేనా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విభిన్నమైన ప్రమోషన్స్ తో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు రష్మిక మందన్న హాజరు అవ్వడం వల్ల సినిమా స్థాయి పెరిగింది అనడంలో సందేహం లేదు. అందుకే గంగం గణేశా సినిమా పై సోషల్‌ మీడియా జనాలతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది.

ఒక విభిన్నమైన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుంది అంటూ దర్శక నిర్మాతలు మరియు హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆనంద్‌ దేవరకొండ నటించిన సినిమాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ కి లక్‌ కలిసి వస్తుందా అనేది చూడాలి.