Begin typing your search above and press return to search.

అలా చేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ : ఆనంద్

అయితే నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తన మనసులోని మాటలను బయట పెట్టారు ఆనంద్.

By:  Tupaki Desk   |   21 May 2024 4:18 AM GMT
అలా చేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ : ఆనంద్
X

బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీతో అలరించేందుకు రెడీ అయిపోయారు. ఆనంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గం గం గణేశా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఉదయ్ శెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఆనంద్ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇదే.

ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 31వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఆనంద్.. తన సిక్స్ ప్యాక్ బాడీ పిక్ ను రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు. ఇక మేకర్స్ నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ఓ దేవుడి విగ్రహం దొంగలించడానికి రెండు గ్రూపుల మధ్య జరిగిన స్టోరీనే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది.

అయితే నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తన మనసులోని మాటలను బయట పెట్టారు ఆనంద్. సినిమా పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటుందని, హీరోకి ఎక్కువ ప్రాధాన్యత అంతా ఇస్తారని చెప్పారు. కానీ సినిమా డైరెక్టర్ కే మొదటి ప్రాధాన్యత దక్కాలని అన్నారు. రీసెంట్ గా డైరెక్టర్స్ డే ఘనంగా జరుపుకున్నామని చెబుతూ.. దర్శకులందరికీ కంగ్రాట్స్ తెలిపారు ఆనంద్.

"తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు, మీడియా, అభిమానులు మనమంతా ఒక కుటుంబం. ఎప్పుడైనా ఇండస్ట్రీలో కాంపిటీషన్ పాజిటివ్ గా ఉండాలి. ఆ కాంపిటీషన్ ఇప్పుడు కంపేరిజన్ గా మారిపోతుంది. లుక్స్, లెక్కలు ఇలా అన్నీ కంపేర్ చేస్తున్నారు. దీని వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీని వేరే ఇండస్ట్రీతో కంపేర్ చేసి.. మనం మంచి సినిమాలు తీయడం లేదంటున్నారు. బలగం, మ్యాడ్, బేబీ వంటి ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నాం" అని తెలిపారు.

"ఇండస్ట్రీలో ఎవరు ఏది సాధించినా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి. అలా కాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్ళు సాధించే విజయాలు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. సాయి రాజేష్ గారికి నేషనల్ అవార్డు, బన్నీ అన్నకు నేషనల్ అవార్డు, చిరు గారికి పద్మవిభూషణ్ వచ్చాయి. నేషనల్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు" అని ఆనంద్ దేవరకొండ తెలిపారు.

ఇక తాను ఇప్పటి దాకా రియలిస్టిక్, నేచురల్ మూవీస్ చేశానని తెలిపారు విజయ్. ప్రతి సినిమాను బేబీతో కంపేర్ చేయకూడదని చెప్పారు. గం గం గణేశాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో వస్తున్నానని తెలిపారు. ఇది టిపికల్ జానర్ మూవీ అని, క్రైమ్ కామెడీ కథతో ఉంటుందని వెల్లడించారు. థియేటర్స్ లో ఈ నెల 31న న్యూ కాన్సెప్ట్ తో వస్తున్న గం గం గణేశా మూవీని చూడాలని కోరారు. మరి ఆనంద్ ఎలాంటి హిట్ కొడతారో వెయిట్ అండ్ సీ.