అన్న సినిమాపై నెగిటివ్ టాక్.. దేవరకొండ తమ్ముడు ఏమన్నాడంటే..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్.
By: Tupaki Desk | 21 May 2024 9:24 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని దిల్ రాజుకి భారీ నష్టాలు తీసుకొచ్చాయి. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల తిరస్కరణకి గురైంది. మరీ అంత తీసిపారేసేంత బ్యాడ్ మూవీ కాకపోయిన ఫ్యామిలీ స్టార్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా నెగిటివ్ ప్రచారం నడిచింది.
దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావడం మానేశారు. దీంతో దిల్ రాజు మూవీని ఎంతగా ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు. ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందు నుంచి ఈ చిత్రంపై నెగిటివ్ ట్రోలింగ్ మొదలైంది. దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకి సైతం ఫిర్యాదు చేశారు. గతంలో కూడా విజయ్ సినిమాలపై ఈ విధంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్ చేశారు.
తాజాగా ఈ అంశంపై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. గంగం గణేశా మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యాడు. ఫ్యామిలీ స్టార్ మూవీపై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని తెలిపాడు. సినిమా రిలీజ్ కావడానికి 48 గంటల ముందే విజయ్ పాత ఫ్లాప్ సినిమాలకి సంబంధించిన పబ్లిక్ టాక్ ని యుట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వాటికి ఫ్యామిలీ స్టార్ మూవీ పబ్లిక్ టాక్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టారు.
ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ సినిమా కన్ఫ్యూజ్ అయ్యారు. సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ చెబితే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరికైనా ఒపీనియన్ చెప్పే రైట్స్ ఉంటుంది. అయితే రిలీజ్ కాకుండానే ఇలా ఎందుకు ఎటాక్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసాం. ఇలాంటివాళ్ళు ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరం. వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఆనంద్ పేర్కొన్నారు.
ఇకపై విజయ్ నుంచి మరింత బెస్ట్ మూవీస్ వస్తాయని ఆనంద్ దేవరకొండ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు. ప్రస్తుతం మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. అవన్నీ కూడా మీకు నచ్చుతాయని భావిస్తున్నాం అని ఆనంద్ దేవరకొండ తన స్పీచ్ లో ఫ్యామిలీ స్టార్ మూవీపై జరిగిన నెగిటివ్ ప్రచారంపై స్పందించారు.