Begin typing your search above and press return to search.

ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా: రష్మిక

పాన్ ఇండియా హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన

By:  Tupaki Desk   |   28 May 2024 4:02 AM GMT
ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా: రష్మిక
X

పాన్ ఇండియా హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు యానిమల్ మూవీతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పుష్ప తర్వాత మరో పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాలు రష్మిక మందన ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. ప్రస్తుతం ఆమె నటించిన పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

పాన్ ఇండియా బ్రాండ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక వరుస అవకాశాలు అందుకుంటుంది. మరో వైపు తెలుగులో కూడా స్టార్ హీరోలకి జోడీగా రష్మిక పేరుని ఎక్కువ పరిశీలిస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి మూవీ కోసం రష్మికని ట్రై చేస్తున్నారంట. ఇదిలా ఉంటే రష్మిక మందన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ లీ బాండింగ్ ఉంది.

రెగ్యులర్ గా రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆనంద్ దేవరకొండ సినిమాలని దగ్గరుండి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అయితే విజయ్, రష్మిక మధ్య అంతకు మించి ఏదో ఉందనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. దీనిపై వారిద్దరూ డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వలేదు. మంచి ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పారు. తాజాగా ఆనంద్ దేవరకొండ గంగం గణేశా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రష్మిక మందన వచ్చింది.

ఈ సందర్భంగా ఆనంద్, రష్మిక మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ దేవరకొండ రష్మిక దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైన కోస్టార్ ఎవరు అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి రష్మిక వెంటనే సమాధానం చెప్పలేదు. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా… అలా స్పాట్ లో పెట్టేస్తే ఎలా అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది. దానికి వెనుక నుంచి రౌడీ అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. రష్మిక కూడా అవును రౌడీ బాయ్ అంటూ చెప్పింది.

రౌడీ కాకపోయిన చిన్న రౌడీ అని చెప్పొచ్చు అంటూ ఆనంద్ దేవరకొండ అన్నాడు. దానికి ఆమె సరే చిన్న రౌడీనే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రష్మిక మందన పాన్ ఇండియా స్టార్ అయిన ఆమెకి ఇష్టమైన కోస్టార్ విజయ్ దేవరకొండ అని డైరెక్ట్ గానే ఒప్పుకుందని ఆ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియోపై చాలా భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.