ఆ ఇష్టంతోనే కల్కిలో ఆనంద్ మహీంద్రా టెక్నాలజీ !
ఓ పెద్ద పారిశ్రామిక వేత్త ఇలా ఓ సినిమా కోసం దిగి రావడం అన్నది నిజంగా గొప్ప విషయంగా అంతా భావించారు.
By: Tupaki Desk | 25 Feb 2024 1:30 PM GMT`కల్కీ 2898` కోసం ఆనంద్ మహీంద్ర గ్రూప్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. మీ సహాయం మాకు కావాలి అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ కోరగా అందుకు ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించి తప్ప కుండా అంటూ తమ టెక్నాలజీ..టీమ్ మొత్తాన్ని నాగ్ అశ్విన్ కి అప్పగించారు. ఓ పెద్ద పారిశ్రామిక వేత్త ఇలా ఓ సినిమా కోసం దిగి రావడం అన్నది నిజంగా గొప్ప విషయంగా అంతా భావించారు.
మరి నాగ్ అశ్విన్ మీద ఏ నమ్మకంతో ఆనంద్ మహింద్రా ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? అన్న విమర్శలు సైతం తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటికి ఆనంద్ మహీంద్రాకి ఉన్న ఆసక్తే కల్కీలో భాగం చేసిందని తెలుస్తోంది. ఆనంద్ మహీంద్రాకి చిన్న ప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం అంట. ఆ కోరికతోనే ఆ రంగంలోకి వెళ్లానంటున్నారు. దీనిలో భాగంగానే కుంభమేళాని తన దగ్గర ఉన్న 16 ఎంఎం కెమెరాతో షూట్ చేసారుట.
ఇండోర్ లోని ఓ చిన్న గ్రామంలో ఈ డాక్యుమెంటరీని షూట్ చేసినట్లు తెలిపారు. వ్యాపార రంగంలోకి వచ్చాక ఆ ఫోటో గ్రఫీ అలవాటుగా మారిందన్నారు. చిన్న వయసులోనే తండ్రితో ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్తానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదుట. ఆ తర్వాత కొన్నాళ్లకి బిజినెస్ వైపు వస్తానన్నా అభ్యంతరం చెప్పలేదుట. ఆ రకంగానే తన పిల్లలకు అన్ని రకాల స్వేచ్ఛ కల్పించినట్లు ఆనంద్ మహీంద్ర గుర్తు చేసుకున్నారు.
నాగ్ అశ్విన్ ట్వీట్ ని ఆనంద్ మహీంద్రా అంగీకరించి సహాయం అందిస్తాను అనగానే అంతా షాక్ అయ్యారు. నాగ్ అశ్విన్ కోరిన సహాయం కంటే చాలా ఎక్కువగానే ఆనంద్ మహీంద్రా చేసారు. సినిమా లకు..ఆయన వ్యాపారానికి ఏం సంబంధం లేదు. కానీ ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు..టెక్నాలజీ నిపుణులు ఉండగా మహీంద్రానే ముందుకు వచ్చారంటే? ఆయనకు సినిమాలంటే ఎంత ఆసక్తి ఉండాలి. అదే నాగ్ అశ్విన్ కి అడ్వాంటేజ్ గా మారింది. `కల్కీ 2898` లో భాగమైంది.