Begin typing your search above and press return to search.

గం గం గణేశా.. ఆనంద్ ఈసారి ఏం చేస్తాడో..

ఇప్పుడు గం గం గణేశా చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 12:56 PM GMT
గం గం గణేశా.. ఆనంద్ ఈసారి ఏం చేస్తాడో..
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యువ నటుడు ఆనంద్ దేవరకొండ. గత ఏడాది బేబీ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. మూవీలో కూడా తన యాక్టింగ్ తో కట్టిపడేశారు. ఇప్పుడు గం గం గణేశా చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


క్రేజీ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి గం గం గణేశా మూవీని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై వంశీకృష్ణ కారుమంచి, కేదార్ సెలగం శెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా నటించారు. ఇమ్మాన్యుయెల్, ప్రిన్స్ యావర్‌, వెన్నెల కిషోర్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించగా.. చైతన్ భరద్వాజ్ డీసెంట్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటి వరకు తన సినిమాల్లో ఎక్కువగా పక్కింటి అబ్బాయి పాత్రల్లో కనిపించిన ఆనంద్.. గం గం గణేశాలో కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్మార్ట్ గయ్ గా, కామెడీ రోల్ లో సందడి చేయనున్నారట ఆనంద్. అయితే కామెడీతో అలరించడం ఏ హీరోకు అయినా కత్తి మీద సాము లాంటిదే. అందులో సక్సెస్ అయితే ఇండస్ట్రీలో సదరు హీరోకు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్ ను చూస్తుంటే.. ఆనంద్ కామెడీ రోల్ లో అతుక్కుపోయినట్లే కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఆనంద్ ది లీడ్ రోల్ కాగా.. ఇమ్మాన్యుయెల్, యావర్, చైతన్య కృష్ణ, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు పోషించిన పాత్రల చుట్టూ కూడా సినిమా తిరగనున్నట్లు తెలుస్తోంది. ఆనంద్ తో పాటు వారి పాత్రలనూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా మేకర్స్ డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాననే పట్టుదలతో ఉన్నారు ఆనంద్. మూవీ కోసం బాగా కష్టపడినట్లు పలుమార్లు చెప్పారు. జిమ్ లో ఫుల్ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ కూడా సంపాదించుకున్నారు. మ్యూజిక్ లవర్స్ కు ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేచురల్ గా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో.