వైరల్ : అప్పులతో ఆడంబరాలు గురించి అనంత్ శ్రీరామ్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సింపుల్ లైఫ్ స్టైల్ కి కారణం ఏంటి అనే విషయమై క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 29 Oct 2024 7:30 AM GMTటాలీవుడ్ ప్రముఖ పాటల రచయితల్లో అనంత్ శ్రీరామ్ ఒకరు. ఆయన ఏం మాట్లాడి చాలా డెప్త్ ఉంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన తెలుగు కూడా చాలా స్వచ్చంగా ఉంటుందని అంటూ ఉంటారు. అలాంటి అనంత్ శ్రీరామ్ లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆయన సంపాదనతో పోల్చితే ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారు కు పోలిక ఉండదు. ఆయన కావాలి అనుకుంటే ఖరీదైన కారును కొనుగోలు చేయవచ్చు, ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కంటే రెండు మూడు రెట్లు పెద్ద ఇల్లు కొనుగోలు చేయగలరు. కానీ ఆయన మాత్రం పెద్ద కారు వద్దు, పెద్ద ఇల్లు వద్దని అంటూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సింపుల్ లైఫ్ స్టైల్ కి కారణం ఏంటి అనే విషయమై క్లారిటీ ఇచ్చారు.
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ... ఆడంబరాల కోసం అప్పులు చేయడం అతి పెద్ద తప్పు. అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు అని అన్నారు. తన ముత్తాత అప్పట్లోనే లక్ష రూపాయలు అప్పు చేసి మా తాత మీద వేసి చనిపోయారు. దాంతో ఆ అప్పును తీర్చడానికి మా తాత ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన జీవితం మొత్తం చాలా సింపుల్ లైఫ్ ను లీడ్ చేశారు. అప్పును తీర్చడంతో పాటు, మిగిలి ఉన్న ఆస్తిని కాపాడటం కోసం ఆయన తన జీవితంను త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే అప్పు చేయడం అనేది అతి పెద్ద తప్పు అని నా అభిప్రాయం అన్నారు.
మా తాత గారు అప్పులు తీర్చి సింపుల్ జీవితంను గడపడం వల్లే తదుపరి తరానికి ఆ కాస్త ఆస్తిని అయినా మిగల్చారు. ఆయన మిగిల్చిన ఆస్తి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అనుకుంటాను. అందుకే నేను సైతం ఆయన మాదిరిగానే సింపుల్ జీవితంను గడపడం ద్వారా తదుపరి తరాలకు మంచి చేయాలనే ఉద్దేశం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆడంబరాల కోసం అప్పులు చేయడం వల్ల చివరకు అశాంతి మిగులుతుందని అనంత్ శ్రీరామ్ చెప్పిన జీవిత సత్యాలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే కారు, ఇల్లు లో జీవితాన్ని చాలా లగ్జరీగా గడపవచ్చు. కానీ ఆ అప్పు నేను చేయాలి అనుకోవడం లేదు. నా వద్ద డబ్బు ఉంటే వాటిని కొనుగోలు చేస్తాను, లేదంటే ప్రస్తుతం ఉన్నట్లుగానే జీవితాన్ని సాగిస్తాను. అంతే తప్ప లగ్జరీ వస్తువుల కోసం అప్పులు చేయాలని తాను ఎప్పుడు అనుకోనని అనంత్ శ్రీరామ్ అన్నారు. నిజంగా అప్పులు చిన్నవే అనుకుంటాం కానీ, వాటి వల్ల మనసుకు అశాంతి కలగడం మొదలుకుని కుటుంబంలో గొడవలు వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదురు అవుతాయి. అందుకే అప్పులు అనేవి సాధ్యం అయినంత వరకు ప్రతి ఒక్కరు అవైడ్ చేయాలని అనంత్ శ్రీరామ్ సూచించారు.