10,000 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అనంత్ శ్రీరామ్!
500 మీటర్ల ఎత్తు నుంచి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. చెమటలు పట్టేస్తాయి. గుండెల్లో ఒణుకు మొదల వుతుంది
By: Tupaki Desk | 13 July 2024 6:43 AM GMT500 మీటర్ల ఎత్తు నుంచి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. చెమటలు పట్టేస్తాయి. గుండెల్లో ఒణుకు మొదల వుతుంది. మళ్లీ ఆ ఎత్తు నుంచి లోతును చూసే ప్రయత్నం చేయాలంటే? వెనకడుగు వేస్తాం. అలాంటింది ఏకంగా పదివేల ఎత్తు నుంచి దూకేసి షాకిచ్చాడు సింగర్ అనంత్ శ్రీరామ్. తాజాగా ఆయన బంగీ జంప్ చేసా రు. లద్దాక్ వెకేషన్ కి వెళ్లిన అనంత్ శ్రీరామ్ జన్సార్క్ నదిపై 10500 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందకు దూకేసి ఎంజాయ్ చేస్తున్నా అనేసాడు.
దాదాపు 192 అడుగుల వరకూ లోయలో కాసేపు కిందకు వేలాడు జంపింగ్ అనుభూతిని ఆస్వాదించాడు. అతడిలో ఏమాత్రం భయం, బెణుకు కనిపించలేదు. దూకిన తర్వాత నేను మనిషినా? గాలిపటాన్నా? అనే అనుభూతి కలిగిందన్నాడు. ప్రతీ ఒక్కరు ఈ అనుభూతి పొందాలని అన్నాడు. కానీ అనంత్ శ్రీరామ్ గుండె ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. సన్నగా, బక్కగా ఉన్నా! తనకి గుండై ధైర్యం మాత్రాం చాలా ఎక్కువ అని నిరూపించాడు.
అనంత్ అంటే కేవలం పాటలు మాత్రమే రాయడు..ఇలాంటి సాహసాలు కూడా చేస్తాడు ప్రూవ్ చేసాడు. అతడి జంపింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దూకే సమయంలో గానీ...దూకిన తర్వాత గానీ... వేలాడి న సమయంలో గానీ ఎక్కడా భయపడింది లేదు. దీంతో అనంత్ శ్రీరామ్ ని నెటిజనులు ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతున్నారు. అతడిలో ఇన్ని గట్స్ ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
రచయిత పరిచయమైన అనంత్ శ్రీరామ్ కాల క్రమంలో తనలో చాలా ఛేంజోవర్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేను పాటలు మాత్రమే కాదు..డాన్సులు ఇరగదీస్తానని చాటి చెప్పాడు. ఒళ్లును విల్లులా వంచేసే స్టేప్పులేసాడు. అతడి డాన్స్ చూసి మాష్టర్లే షాక్ అయ్యారు. తాజాగా ఈ ఫీట్ తో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు.