Begin typing your search above and press return to search.

హీరో ఇంట అంబానీ స‌న్ హ‌ల్చ‌ల్!

దీంతో కుటుంబ స‌భ్యులంతా పెళ్లి ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికల‌ పంపిణీ కార్య‌క్రమం అన్న‌ది అత్యంత కీల‌క‌మైన‌ది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:06 PM GMT
హీరో ఇంట అంబానీ స‌న్ హ‌ల్చ‌ల్!
X

అంబానీ ఇంట ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు షురూ అయిన సంగ‌తి తెలిసిందే. జామ్ న‌గ‌ర్ ఈవెంట్ అటుపై విదేశాల్లో మ‌రో ఈవెంట్ నిర్వ‌హించి అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉంటుందో మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పారు. ఇక జులై 12న పెళ్లి తేదిగానూ నిశ్చ‌యించారు. దీంతో కుటుంబ స‌భ్యులంతా పెళ్లి ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికల‌ పంపిణీ కార్య‌క్రమం అన్న‌ది అత్యంత కీల‌క‌మైన‌ది.

కావాల్సిన వాళ్లంద‌రికీ స్వ‌యంగా వెళ్లి అహ్వాన ప‌త్రిక‌లు అందించాలి. పంపించాల్సిన వాళ్ల‌కు పోస్ట్ లు..ఈమెయిల్స్...వాట్సాప్ ల ద్వారా పంపించ‌డం కూడా మొద‌లైపోయింది. ముఖ్యంగా అంబానీ ఇంట పెళ్లి అంటే బాలీవుడ్ తార‌ల‌తో త‌ళ‌త‌ళ‌లాడాల్సిందే. ఎంత మంది బిజెనెస్ టైకూన్లు ఉన్నా? సెల‌బ్రిటీ లేక‌పోతే అక్క‌డ క‌ళే ఉండ‌దు. అందుకే ఈవెంట్ లో ప్ర‌త్యేకంగా సెల‌బ్రిటీలు పాల్గొనేలా చూడ‌టం అంబానీ స్టైల్.

దీనిలో భాగంగా బాలీవుడ్, కోలీవుడ్..టాలీవుడ్ ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి కూడా పెళ్లి ఆహ్వాన ప‌త్రిక‌లు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా అనంత్ అంబానీ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు తానే స్వ‌యంగా వెడ్డింగ్ కార్డు అందిస్తున్నాడు. తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంట్లో అనంత్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌-కాజోల్ దంప‌తుల‌కు అనంత్ స్వ‌యంగా కార్డు అందించి పెళ్లికి త‌ప్ప‌కుండా రావాల్సిందిగా ఆహ్వానించాడు.

ఇంకా చాలా మంది సెల‌బ్రిటీల‌ను అనంత్ స్వ‌యంగా క‌లిసే అవ‌కాశం ఉంది. అలాగే ఇంకా పెద్ద పెద్ద హీరోల‌కు అంబానీ నే స్వ‌యంగా వెళ్లి ఆహ్వ‌నించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌కు ముందు అనంత్ త‌ల్లి నీతా అంబానీ కాశీ విశ్వ‌నాధుని ఆల‌యాన్ని సంద‌ర్శించారు. దేవుని ప‌టాల వ‌ద్ద మొద‌టి కార్డును పెట్టిన‌ట్లు తెలుస్తోంది.