అనంత్ అంబానీ ఏసీ గాలి పీలిస్తే ఏమవుతుంది?
డబ్బు స్టామినా సరిపోదు.. మెంటల్ స్టామినా చాలా ముఖ్యం.. ప్రతి కుటుంబంలో ఎమోషన్స్ ఉంటాయి
By: Tupaki Desk | 18 July 2024 4:53 AM GMT''డబ్బు స్టామినా సరిపోదు.. మెంటల్ స్టామినా చాలా ముఖ్యం.. ప్రతి కుటుంబంలో ఎమోషన్స్ ఉంటాయి. కానీ వాటిని తట్టుకుని నిలబడినవాడే గొప్పవాడు'' అని విశ్లేషిస్తున్నారు లైఫ్ స్టైల్ కోచ్ లు . చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటిది అనంత్ అంబానీ తన అధిక బరువు, రూపం విషయంలో ఎంతటి ఘోరమైన ట్రోల్స్ ని ఎదుర్కొన్నాడు? అతడిలో మెంటల్ స్టామినా ఎంతో గొప్పది. తనలో కేవలం పాజిటివిటీ మాత్రమే ఉంది..'' అని విశ్లేషిస్తున్నారు ప్రముఖ జీవనశైలి కోచ్‌లు.
కొన్ని లక్షల కోట్లు ఉన్న అనంత్ అంబానీకీ ..ఏసీ గాలి తగలకూడదు.. అది అతడి ఆస్తమాను ఎంతో పెంచుతుంది. అతడి అనారోగ్య సమస్య గురించి తెలిసి కూడా రాధికా మర్చంట్ అతడిని పెళ్లాడింది. తనకు ఇంత పెద్ద సమస్య ఉన్నా కానీ అనంత్ మెంటల్ స్టామినా గొప్పది గనుక తట్టుకోగలిగాడు. అతడిని ట్రోల్ చేసి జోకులు వేసి కామెంట్లు చేసినా అన్నిటినీ తట్టుకోగలిగాడు. అతడిలో ఏ కోణంలో చూసినా కేవలం పాజిటివిటీనే కనిపిస్తుంది. రాధిక అతడిని ప్రేమించి పెళ్లాడింది. అతడి చేయి పట్టుకుని జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది. రాధిక మర్చంట్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ, అనంత్ ని పెళ్లాడాలనే నిర్ణయం వెనక ప్రేమ ఉందని నిరూపణ అయిందని విశ్లేషిస్తున్నారు.
తన తండ్రి ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి అవసరమైన సమయం కేటాయిస్తారని, అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో చెబుతున్నప్పుడు ముఖేష్ అంబానీ కంట కన్నీళ్లు అందరినీ కదిలించాయి. అనంత్- రాధిక జీవితం బావుండాలని జీవన శైలి కోచ్ లతో పాటు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అనంత్ అంబానీకి అరుదైన అనారోగ్య సమస్య కారణంగా అధిక బరువు పెరిగాడు. అతడు దాదాపు 206 కేజీల నుంచి 100 కేజీల బరువు తగ్గాడు. అనంతరం తన స్నేహితురాలు రాధికను పెళ్లాడాడు. రెండు ప్రీవెడ్డింగుల అనంతరం జూన్ 12న రాధిక మర్చంట్ ని అనంత్ అంబానీ పళ్లాడాడు. ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం దాదాపు 5000 కోట్లు ఖర్చు చేసింది. జీవితం చాలా చిన్నది. అందులో ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వచ్చి అనంత్- రాధిక జంటను ధీవించి వెళ్లారు. ఆ ధీవెనలు ఫలించి అనంత్ -రాధిక జీవితం సంతోషంగా మారాలి.