Begin typing your search above and press return to search.

జులై 12 ముంబై మొత్తం బ్లాక్ అవుతుందా!

అనంత్ అంబానీ-రాధికామ‌ర్చెంట్ వివాహం ఈనెల 12న గ్రాండ్ గా ముంబైలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 6:45 AM GMT
జులై 12 ముంబై మొత్తం బ్లాక్ అవుతుందా!
X

అనంత్ అంబానీ-రాధికామ‌ర్చెంట్ వివాహం ఈనెల 12న గ్రాండ్ గా ముంబైలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు మొద‌లైపోయాయి. ఇక వివాహం ద‌గ్గ‌ర ప‌డే కొద్ది నెల‌కో ఈవెంట్ చొప్పున చేసుకుంటూ వ‌చ్చారు. ఇటీవ‌లే సంగీత్ గ్రాండ్ గా జ‌రిగింది. ఈవేడుక‌లో పాప్ సింగర్ జ‌స్టీన్ బీబ‌ర్ ఆట పాట‌ల‌తో అతిధుల్ని అల‌రించారు. అతిధులంతా బీబ‌ర్ మ్యూజిక్ వ‌ర‌ల్డ్ లో మ‌మేక‌మైపోయారు. అత‌డి ఎంట్రీతో అంబానీ ఇంట పెళ్లికి మ‌రింత ప్రాచుర్యం సంత‌రించుకుంది.

ఇక 12న పెళ్లి వేడుక కోసం 1500 కోట్ల‌కుపైగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ వేడుక‌లో చాలా మంది అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు పాల్గొంటార‌ని తెలుస్తోంది. పుట్ బాల్ దిగ్గ‌జం డేవిడ్ బెక్ హోమ్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది అంబానీ ఆయ‌న్ని క‌లిసారు. ఈనేప‌థ్యంలో బెక్ హామ్ త‌ప్ప‌కుండా అనంత్ పెళ్లికి హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. పెద్ద కుమారుడు పెళ్లికి బ్రిట‌న్ ప్ర‌ధాని హాజ‌రైన నేప‌థ్యంలో ఇప్పుడు కూడా అనంత్ పెళ్లికి విచ్చేసే అవ‌కాశం ఉంది. ఇంట్లో చివ‌రి పెళ్లి ఇదే కాబ‌ట్టి వీలైనంత మంది అంత‌ర్జాతీయ అతిధులు హాజ‌ర‌వుతార‌ని మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

అంత‌ర్జాతీయ పారిశ్రామిక వేత్త‌లు, సెల‌బ్రిటీలు కూడా విచ్చేస్తార‌ని వినిపిస్తోంది. బీబ‌ర్ కంటే ముందు రిహాన్నా, క్యాట్ పెర్రీ, బ్యాక్ స్ట్రీట్ బోయ్స్, ఆండ్రియో బోసెల్లీ లాంటి వారు వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. తాజాజాగా పెళ్లి ద‌గ్గ‌ర ప‌డ‌టంతో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చుట్టు ప‌క్క‌ల పెద్ద స్టార్ హోట‌ల్స్ అన్నీ బుక్ అయ్యాయి. అంబానీ హోట‌ల్స్ అన్నింటిని బ్లాక్ చేసి పెట్టారుట‌. వ‌చ్చిన అతిధులు ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని ర‌కాలుగా అక్క‌డ ప్ర‌త్యేక సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు స‌మాచారం.

పెళ్లికి ముందుగానే వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి అలాంటి వారి కోసం హోట‌ల్ లో స్పెష‌ల్ కుక్స్, చెఫ్ ల‌ను ఏర్పాటు చేసారుట‌. ఆయా హోట‌ల్స్ ప్ర‌క‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పించారుట‌. ముంబై పోలీసుల‌తో పాటు, అంబానీ స్పెష‌ల్ సెక్యూరిటీ టీమ్ కూడా కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. స్లార్ హోట‌ల్స్ నుంచి పెళ్లి వేదిక‌కు చేరుకోవ‌డానికి వాళ్ల స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌ను సిద్దం చేసి పెట్టారుట‌. జూన్ 12 న ట్రాపిక్ కి ఎలాంటి అంత‌రాయం ఏర్ప‌డ‌కుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకునేలా ప్రభుత్వం అదేశాలిచ్చిన‌ట్లు తెలుస్తోంది.