Begin typing your search above and press return to search.

బ‌ర్త్‌డే పార్టీలో స్టార్ కిడ్స్ రిమ్ జిమ్

వారి మ‌ధ్య గొప్ప స్నేహం అన్నివేళ‌లా యువ‌త‌రం దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 6:44 AM GMT
బ‌ర్త్‌డే పార్టీలో స్టార్ కిడ్స్ రిమ్ జిమ్
X

న‌ట‌వార‌సురాళ్లు సుహానా ఖాన్, అనన్య పాండే స్నేహం గురించి తెలిసిందే. ఒక‌రు సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె అయితే, మ‌రొక‌రు న‌టుడు చంకీ పాండే కుమార్తె. అయితే వీళ్ల‌తో రెగ్యుల‌ర్ గా పార్టీల‌కు వ‌చ్చే మ‌రో స్టార్ కిడ్ నవ్య నవేలి నంద. ఈ బ్యూటీ అమితాబ్ మ‌న‌వ‌రాలు(శ్వేతానంద కుమార్తె). క్ల‌బ్ ప‌బ్ లో రెగ్యుల‌ర్ గా చిల్ అయ్యే బ్యాచ్ ఇది. వారి మ‌ధ్య గొప్ప స్నేహం అన్నివేళ‌లా యువ‌త‌రం దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది.


స్పైస్ గ‌ర్ల్స్ పేరుతో సోష‌ల్ మీడియాల్లోను వీళ్ల ఫోటోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి. డిసెంబర్ 7న‌ అనన్య పాండే త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి ఉన్న ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. నవ్య నంద పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇవి. సుహానా .. అన‌న్య తెలుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో అందంగా క‌నిపించ‌గా, బ‌ర్త్ డే బేబి న‌వ్య న‌వేళి వంగ‌పువ్వు రంగు ఫ్రాకులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ముఖ్యంగా న‌వ్య న‌వేళి తన స్నేహితురాళ్ల‌ను క‌లిసిన క్ష‌ణాన త‌న ఆనందాన్ని దాచుకోలేక‌పోయింది. అన్‌స్టాప‌బుల్ అనిపించేలా అంద‌మైన న‌వ్వుతో ఆక‌ర్షించింది.


అమితాబ్ బచ్చన్ మనవరాలు న‌వ్య న‌వేళి బ్రౌన్ బాడీకాన్ డ్రెస్ బ‌ర్త్ డే ఈవెంట్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. పార్టీలో సుహానా- నవ్య విపరీతంగా నవ్వుతుండగా, అనన్య తన నాలుకను చిలిపిగా బయటకు పెట్టి ఫోటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల‌పై మ‌రో స్నేహితురాలు షాన‌యా క‌పూర్ స్పందిస్తూ ల‌వ్ హార్ట్ ఈమోజీని షేర్ చేసింది. అభిమానులు అద్భుత‌మైన గాళ్స్ అంటూ ప్రేమ‌ను కురిపిస్తున్నారు.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అనన్య పాండే త‌దుప‌రి సి. శంకరన్ నాయర్ జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తోంది. సుహానా ఖాన్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కింగ్` షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఇందులో షారూఖ్ కీల‌క పాత్ర‌ధారి. నవ్య నంద ఇటీవ‌ల ప్ర‌తిష్ఠాత్మ‌క ఐఐఎంలో చ‌దువుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. త‌ను పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.