Begin typing your search above and press return to search.

నడుము కామెంట్స్ కి హీరోయిన్ విచిత్రమైన రెస్పాన్స్..!

ఇంతకీ ఆడియన్స్ చేసిన నడుము కామెంట్ కి సంతోషపడ్డ హీరోయిన్ ఎవరు అంటే అనన్య నాగళ్ల అని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్న ఈ అమ్మడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది.

By:  Tupaki Desk   |   2 March 2025 6:00 PM IST
నడుము కామెంట్స్ కి హీరోయిన్ విచిత్రమైన రెస్పాన్స్..!
X

తెర మీద కథానాయికగా మెప్పించే చాలా మంది హీరోయిన్స్ తమని ఆడియన్స్ పొగడితే చాలా సంతోషిస్తారు. ఐతే కొన్నిసార్లు వాళ్ల పొగడ్త కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే ఏమి చేయలేరు. కొందరైతే చిత్ర విచిత్రమైన కామెంట్స్ తో పొగుడుతూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక అవన్నీ చాలా కామన్ అయ్యాయి. ఐతే ఒక హీరోయిన్ డైరెక్ట్ గా ఒక ఆడియన్ మీ నడుము బాగుందని అన్నాడట. మామూలుగా అయితే వేరే హీరోయిన్ అయితే రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ సదరు హీరోయిన్ మాత్రం ఆ టైం లో సంతోషించిందని చెప్పింది.

ఇంతకీ ఆడియన్స్ చేసిన నడుము కామెంట్ కి సంతోషపడ్డ హీరోయిన్ ఎవరు అంటే అనన్య నాగళ్ల అని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్న ఈ అమ్మడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది. మల్లేశం సినిమా నుంచి మొదలైన అనన్యా సినిమాల హంగామా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. అనన్య చేస్తున్న సినిమాల్లో కథాబలం ఉండటం వల్ల ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.

ఐతే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ల తనకు ఇప్పటివరకు వచ్చిన క్రేజీ పొగడ్త గురించి చెప్పమని అడిగితే.. తను ఒకటి రెండు సినిమాలు చేసిన టైం లోనే ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి మీ నడుము బాగుంటుందని చెప్పి వెళ్లిపోయాడని అది చాలా క్రేజీగా అనిపించిందని అన్నది అనన్యా నాగళ్ల. మామూలుగా ఎవరైనా వారి నడుము గురించి కామెంట్ చేస్తే కోపం వస్తుంది కానీ అనన్య మాత్రం అతని కామెంట్ ని చాలా పాజిటివ్ గా తీసుకుంది.

అలా అనన్య నాగళ్ల నడుము కామెంట్ గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈమధ్యనే పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య నాగళ్ల. ముందు చెప్పినట్టుగా ఏదో సినిమా చేశాం అంటే చేశాం అన్నట్టు కాకుండా ప్రతి సినిమా కథ విషయంలో అనన్యా చాలా ఫోకస్ గా ఉంటుంది.

ఐతే సోలో హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ చేయాలని ఉన్నా అందుకు తగిన పాత్రలు రావట్లేదని చెబుతుంది. అనన్యా నాగళ్ల ఈమధ్య కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది. తప్పకుండా అమ్మడికి మంచి ఫ్యూచర్ ఉండేలా కనిపిస్తుంది. ఇలానే అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా తన నటనతో మెప్పిస్తూ వస్తుంది అనన్య నాగళ్ల.