సినిమాల్లోకి వచ్చానని అమ్మను అలా అనేశారు: అనన్య
యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదులుకున్న ఆమె.. మల్లేశం మూవీతో హీరోయిన్ గా పరిచయమయ్యారు.
By: Tupaki Desk | 25 Dec 2024 4:41 AM GMTటాలీవుడ్ హీరోయిన్, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల గురించి అందరికీ తెలిసిందే. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదులుకున్న ఆమె.. మల్లేశం మూవీతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. ప్రియదర్శి హీరోగా నటించిన ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
హీరోయిన్ గా గ్లామర్ కంటే యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అనన్య.. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా.. క్రిస్మస్ కానుకగా నేడు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.
అయితే మేకర్స్ రీసెంట్ గా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో అనన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఇండస్ట్రీ ఎంట్రీ సమయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అనన్య. తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అయిందని, మల్లేశం మూవీతో జర్నీ స్టార్ట్ చేశానని తెలిపారు.
వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదని, షూటింగ్ అయ్యాక మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందున్న టైమ్ లో రెండు నెలల ముందు చెప్పానని అన్నారు. ఆ సమయంలో అమ్మ చాలా గొడవ పెట్టినట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఓ రోజు అమ్మ కాల్ చేసి తనకు జరిగిన విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు.
"నీ పెంపకం అలా ఉంది అని మా అమ్మను ఓన్ రిలేటివ్స్ అన్నారని చెప్పింది. ఆ రోజు చాలా ఫీలయ్యాను. చాలా ఎమోషనల్ కూడా అయ్యాను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలని.. అందుకు చాలా టై చేస్తున్నాను. మల్లేశం తర్వాత నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నా" అని అనన్య తెలిపారు.
"మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్, తంత్ర, పొట్టేల్.. ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్.. అలా అన్నీ ఫిల్మ్స్ లో కూడా నా 100% ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకుని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్ లో క్యారెక్టరైజేషన్ తెలుసుకుని నటిస్తున్నా.. ప్రమోషన్స్‌లో కూడా 100% కన్నా ఎక్కువగా ఇస్తున్నా.." అంటూ అనన్య చెప్పుకొచ్చారు.
"కానీ ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదని చాలా మంది అడుగుతున్నారు. అది ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ మూవీతో అదంతాపోయి మంచి సక్సెస్ అందుకుని సక్సెస్ ఫుల్ యాక్టర్ గా సక్సెస్ మీట్ లో మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాను. అందుకు ప్రిపేర్ కూడా అయ్యా" అని అనన్య నాగళ్ల ధీమా వ్యక్తం చేశారు.