అతడు చెడ్డవాడని తెలిసి.. నటి ఆవేదన!
లైగర్ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Dec 2024 4:55 AM GMTలైగర్ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమాయణం బ్రేకప్ గురించి చాలా కథనాలొచ్చాయి. కానీ బ్రేకప్ వెనక కారణాలేమిటన్నది అనన్య కానీ .. ఆదిత్య కానీ వెల్లడించలేదు. ఈ జంట గౌరవప్రదమైన మౌనాన్ని ఆశ్రయించడంతో ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు. కానీ అనన్య ఇప్పుడిప్పుడే తన మాజీ గురించి ఓపెనవుతోంది.
తాజా చాటింగ్ సెషన్ లో అతడు చెడ్డవాడని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని అన్నారు అనన్య పాండే. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన అనన్య పాండే మాట్లాడుతూ..రిలేషన్ లో ఉన్న కాలంలో చాలా విషయాల్లో అతడి కోసం రాజీకి వచ్చానని తెలిపింది. విడిపోయాక అతడి ఫోటోలన్నిటినీ ఓ చోట కుప్పగా వేసి తగలబెట్టానని, అలా చేస్తుంటే బాధ కలగలేదని వెల్లడించింది. బాంధవ్యంలో చాలా విషయాల్లో రాజీకొచ్చానని తెలిపిన అనన్య .. అతడు చెడ్డవాడు అని తెలిసాక కూడా మనం అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
భాగస్వామిలో నేను కేవలం మంచిని మాత్రమే చూశాను.. అతడి కోసం చాలా విషయాల్లో రాజీకొచ్చానని తెలిపిన అనన్య పాండే.. మనల్ని మనం అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం ఉంటుందని తెలిపింది. ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పు లేదు అని కూడా అంది. తాను కూడా భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఆశాభంగం అయిందని, అది తనను నిరాశపరిచిందని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ సింగిల్ గా ఉన్నాడు. కానీ అనన్య పాండే విదేశీ బోయ్ వాకర్ బ్లాంకోతో సన్నిహితంగా మెలగుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి.