Begin typing your search above and press return to search.

ప్రెండ్స్ గ్యాంగ్ తో పాండే బ్యూటీ షికార్లు!

ఆ మూవ్ మెంట్స్ ని అవ‌స‌ర‌మైన‌ప్పుడు అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటుంది.

By:  Tupaki Desk   |   29 Oct 2024 9:30 AM GMT
ప్రెండ్స్ గ్యాంగ్ తో పాండే బ్యూటీ షికార్లు!
X

ప్రెండ్స్ గ్యాంగ్ తో పార్టీలు ఆస్వాదించ‌డంలో అన‌న్యా పాండే ముందుటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. వీకెండ్ వ‌స్తే? అమ్మ‌డు ప‌బ్ లో చిల్ అవుతుంటుంది. స్నేహితుల్ని వెంటేసుకుని పార్టీలు..వెకేష‌న్లు ఆస్వాదిస్తుంటుంది. అమ్మ‌డి కెరీర్ లో ఇదో దిన‌చ‌ర్య లాంటి కార్య‌క్ర‌మం. ఆ మూవ్ మెంట్స్ ని అవ‌స‌ర‌మైన‌ప్పుడు అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో బ‌ర్త్ డే ట్రీట్ పిక్ వ‌దిలింది.

`కాల్ మీ బే` న‌టీనటుల‌తో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసి కోస్టార్ గుర్ఫతే పిర్జాదా కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేసింది. కాల్ మీ బే సిరిస్ లో ఇత‌డు నీల్ నాయ‌ర్ అనే పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. అత‌డికి త‌న‌దైన శైలిలో విషెస్ తెలియ‌జేసింది. `బేస్ నీల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది అత‌డికి ఉత్తమ సంవత్సరంగా నిలివాలి` అని కోరుకుంది. కాల్ మీ బే టీమ్ కొంద‌రు కారులో క‌లిసి దిగిన పిక్ ని షేర్ చేసింది. కారులో అన‌న్య ప్రంట్ సీట్ లో కూర్చుని గ్యాంగ్ స‌భ్యులంద‌ర్నీ ఎంటర్ టైన్ చేస్తోంది.

వెనుక సీట్లో కూర్చున్న వారంతా సెల్పీ లో తొంగి తొంగి చూడ‌టం గ‌మ‌నించొచ్చు. అన‌న్యా స్నాప్‌షాట్‌లో స్టైలిష్ బ్లాక్ కోట్‌తో జతగా సిజ్లింగ్ ఎరుపు దుస్తులను ధరించింది. టీమ్ అంతా ఇలా క‌నిపించ‌డంతో ? `కాలీ బీ బే సీజ‌న్-2`పై ఆస‌క్తి అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. సీజ‌న్-2ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తొలి భాగం గ్రాండ్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో సీజ‌న్-2 ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తు న్నారు. ఈ నేప‌థ్యంలోనే సెప్టెంబ‌ర్ లోనే అధికారికంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం మేక‌ర్స్ సీజ‌న్ -2 ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. కాల్ మి బే ని ఇషితా మోయిత్రా, రోహిత్ నాయర్ - సమీనా మోట్లేకర్ చేత సృష్టించబడిన శక్తివంతమైన కామెడీ-డ్రామా . దీనికి కోలిన్ డి'కున్హా దర్శకత్వం వహించారు. ఇందులో ముస్కాన్ జాఫేరి, వరుణ్ సూద్, నిహారిక లైరా దత్, విహాన్ సమత్, వీర్ దాస్, రియా సేన్, మినీ మాథుర్, సుచిత్రా పిళ్లై, కరిష్మా తన్నా, సయానీ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్- అపూర్వ మెహతా - సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు.