గర్ల్ ఇన్ బ్లూ.. బ్రాండెడ్ కిల్లర్ పాండే!
నటిగా ఒక్కో సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటున్న అనన్య ఇటీవలే పాపులర్ దుస్తుల బ్రాండ్ కి ప్రచారకర్తగా ఎంపికైంది.
By: Tupaki Desk | 6 Dec 2024 9:30 PM GMTలైగర్ బ్యూటీ అనన్య పాండే వ్యక్తిగత జీవితం తెరిచి ఉంచిన పుస్తకం. ఆదిత్యారాయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత ఈ భామ ఇటీవల పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది. నటిగా ఒక్కో సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటున్న అనన్య ఇటీవలే పాపులర్ దుస్తుల బ్రాండ్ కి ప్రచారకర్తగా ఎంపికైంది.
బ్రాండ్ ప్రచారకర్త అనన్య పాండే లేటెస్ట్ ఫోటోషూట్ యువహృదయాలను కొల్లగొడుతోంది. రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఈ బ్యూటీ కిల్లర్ ఫోజులతో మతులు చెడగొడుతోంది. బ్లూ డెనిమ్స్ లో వెరైటీ డిజైన్స్ తో కిల్ చేసిన అనన్య.. దానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ స్కర్టులతోను మైమరిపించింది. ఐదారు భిన్నమైన దుస్తుల్లో అనన్య ఫోజులు దేనికదే ప్రత్యేకం. బ్లూ కలర్ డెనిమ్స్ లో కనిపించిన అనన్య బ్లూ బ్యాక్ గ్రౌండ్ ఫోటోషూట్ తో చాలా యూనిక్ గా కనిపించింది. డార్క్ బ్లూ ఫ్రాక్.. వైట్ అండ్ బ్లాక్ జీబ్రా లుక్... థై హై డిజైనర్ ఫ్రాక్ లో ఒకదానికొకటి భిన్నంగా తనను తాను ఎలివేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
అనన్య పాండే కేవలం ఒక అంబాసిడర్ .. బ్రాండ్ #ONLYThingIWantIsEverything దుస్తుల ప్రచారంలో కనిపించింది. బాటమ్‌లు, జాకెట్‌లు, జీన్స్, బ్లేజర్‌లు, షర్టులు, స్కర్టులు , టాప్‌లు మాత్రమే ఉన్నాయి.. అంటూ ప్రచార హంగామా షురూ చేసింది. కేవలం ఒకే తరహా ఫ్యాషన్ సెన్స్ తో స్థిరపడకూడదనే జెన్ -Z వైఖరిని ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది. అనన్య పాండే నటించిన #ONLY థింగ్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ప్రచార వీడియో ఇటీవల వైరల్ గా మారుతోంది.
అనన్య ప్రస్తుతం `కాల్ మీ బే` రెండవ సీజన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో లాయర్ సి శంకరన్ నాయర్ బయోపిక్ లోను అనన్య నటిస్తోంది. కొన్ని వారాల క్రితం.. `చాంద్ మేరా దిల్` అనే చిత్రంలో నటిస్తున్నట్టు అనన్య వెల్లడించింది.