Begin typing your search above and press return to search.

దేశంలో ముగ్గురు పెద్ద స్టార్ల వాట్సాప్ గ్రూప్ నేమ్ ఇదే

దీనికోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా కాలంగా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అది సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే నిజం కానుంద‌ని కూడా ఇటీవ‌ల క‌థ‌న‌లొచ్చాయి

By:  Tupaki Desk   |   8 Jan 2025 9:30 AM GMT
దేశంలో ముగ్గురు పెద్ద స్టార్ల వాట్సాప్ గ్రూప్ నేమ్ ఇదే
X

బాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏల్తోంది ఖాన్‌ల త్ర‌యం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఆ ముగ్గురూ తెర‌పై క‌నిపిస్తే చాలు.. సంచ‌ల‌నాలే. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాయ‌డంలో ఒక‌రికొక‌రు పోటీ. ఆ ముగ్గురూ మంచి స్నేహితులు కూడా. ఒక‌రి సినిమా కోసం ఒక‌రు స‌హ‌కారానికి ముందుకు వ‌స్తారు. స‌ల్మాన్-షారూఖ్‌- అమీర్ క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం చూడాల‌ని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీనికోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా కాలంగా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అది సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే నిజం కానుంద‌ని కూడా ఇటీవ‌ల క‌థ‌న‌లొచ్చాయి.

ఆస‌క్తిక‌రంగా ఇప్పుడు ఆ ముగ్గురి ఫోన్ నంబ‌ర్ల‌తో వాట్సాప్ గ్రూప్ క్రియేటైతే దానికి ఎలాంటి టైటిల్ ఉండాలి? .. ఈ ప్ర‌శ్న‌కు స‌రైన జ‌వాబు దొరికింది. `మై నేమ్ ఈజ్ ఖాన్` అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని యువ‌క‌థానాయిక అన‌న్య పాండే సూచించింది. కనెక్ట్ సినీ ఇంటర్వ్యూలో అనన్య పాండే రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఈ సూచ‌న చేసింది. దీనిలో ఆమె కొంతమంది ప్రముఖుల వాట్సాప్ గ్రూపుల‌కు టైటిల్స్ ని నిర్ణ‌యించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ బృందానికి టైటిల్ ఇవ్వమని ప్ర‌శ్నించ‌గా..వెంటనే `మై నేమ్ ఈజ్ ఖాన్` అని చెప్పింది. SRK సినిమా టైటిల్‌తో స్ఫూర్తి పొందినా కానీ ఇది వంద‌శాతం యాప్ట్ అని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

కరణ్ జోహార్, అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా క‌లిసి ఉండే వాట్సాప్ గ్రూప్‌కి కూడా అన‌న్య పేరు పెట్టారు. ఇది కరణ్, అత‌డి స్టూడెంట్స్ కి సంబంధించినదిగా ఉండాలని సూచించింది. `స్టూడెంట్స్ ఫ‌ర్ లైఫ్` అనే టైటిల్ ని అన‌న్య సూచించింది. అలాగే కింగ్ ఖాన్ ముంబై నివాసం మన్నత్‌లో పార్టీల గురించి కూడా అన‌న్య‌ ఓపెనైంది. మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీ లు, ఇత‌ర పార్టీల‌కు సుహానా ఖాన్, సానాయ కపూర్, నవ్య నందతో కలిసి మన్నత్‌కు వెళతానని అనన్య వెల్ల‌డించారు. తిన‌డం, డ్యాన్సులు చేయ‌డంతో స్నేహితులంతా స‌ర‌దాగా గ‌డిపేస్తామ‌ని వెల్ల‌డించారు. షారూఖ్.. సుహానాఖాన్ ల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటాన‌ని కూడా అన‌న్య పాండే వెల్ల‌డించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అనన్య పాండే లైగ‌ర్ చిత్రంతో ద‌క్షిణాదికి సుప‌రిచిత‌మైంది. త‌దుప‌రి సి. శంకరన్ నాయర్ ఆధారంగా ఓ చిత్రంలో నటించనుంది. అక్షయ్ కుమార్, R. మాధవన్‌లతోను ఓ సినిమా చేస్తోంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 14 మార్చి 2025న థియేట‌ర్ల‌లోకి విడుద‌ల కానుంది.