ఫోటో స్టోరి: అనన్య పాండే యువరాణి వైబ్స్!
మరోవైపు అనన్య నిరంతర ఫోటోషూట్లు యూత్ ని టీజ్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా అనన్య షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోషూట్ వెబ్ లో వైరల్ గా దూసుకెళుతోంది
By: Tupaki Desk | 8 Feb 2025 12:30 AM GMTఅందానికి అందం, ప్రతిభతో మైమరిపిస్తున్న బ్యూటీ అనన్య పాండే. `లైగర్` చిత్రంతో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఆ తర్వాత సీఆర్‌టిఎల్, కాల్ మీ బే వెబ్ సిరీస్ లలో నటిగా నిరూపించింది. అనన్య ఎనర్జీ, వైవిధ్యమైన నట ప్రదర్శనకు యువతరం ఫిదా అయ్యారు.
మరోవైపు అనన్య నిరంతర ఫోటోషూట్లు యూత్ ని టీజ్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా అనన్య షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోషూట్ వెబ్ లో వైరల్ గా దూసుకెళుతోంది. అందమైన క్రిస్టల్స్ తో డిజైన్ చేసిన స్పెషల్ డిజైనర్ బ్లౌజ్, డిజైనర్ శారీలో అనన్య ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టే మెడలో భారీ క్రిస్టలైన్ నెక్లెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పింక్ చీరకు కాంబినేషన్ గా తలలో తురిమిన పింక్ ఫ్లవర్స్ అంతే ఆకర్షణను పెంచాయి. అనన్య లుక్ చూడగానే యువరాణి వైబ్స్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే హాట్ కంటెంట్ ని ప్రెజెంట్ చేయడంలో అనన్య తర్వాతే అని పొగిడేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అద్భుతమైన ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అనన్య పై ఫోటోషూట్ల పరంగా ప్రయోగాలకు యువతరం ఫిదా అయిపోతోంది. ఓవరాల్ గా అనన్య లుక్ కి మంచి మార్కులే పడ్డాయి.. ఈ కొత్త రూపంపై ఒక రేంజులో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.