హృదయం ముక్కలైనా.. అనన్య చిట్కా ఇదీ
కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన అనన్య పాండే తన గత సంబంధాల గురించి బహిరంగంగా చెప్పింది.
By: Tupaki Desk | 29 Sep 2024 7:15 AM GMTకొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన అనన్య పాండే తన గత సంబంధాల గురించి బహిరంగంగా చెప్పింది. ఖలీపిలీ టైమ్ లో కొద్దికాలం పాటు ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేసిందిట. `పతి పత్నీ ఔర్ వో` సహనటుడు కార్తీక్ ఆర్యన్‌తో కూడా డేట్ చేసానని తెలిపింది. కానీ ఇవన్నీ బ్రేకప్ అయ్యాయి.
ఆదర్శవంతమైన భాగస్వామి కోసం తాను వెతుకుతున్న క్రమంలో తన ఆలోచనలను వెల్లడించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హృదయం ముక్కలైతే దానిని ఎలా ఎదుర్కోవాలి? అని ప్రశ్నించగా, అనన్య తనకు ప్రత్యేకమైన కోపింగ్ మెకానిజం ఉందని వెల్లడించింది. ``ముందుగా ధైర్యమైన ముఖాన్ని ధరించాలి. రోజుకు 12 గంటల పాటు తన భావోద్వేగాలను స్విచ్ ఆఫ్ చేయాలి`` అని తెలిపింది. నిజాయితీగా చెప్పాలంటే.. అది నా పనిని కొంత సులభతరం చేస్తుంది.. ఎందుకంటే 12 గంటల పాటు స్విచ్ ఆఫ్ చేయగల స్వేచ్ఛ నాకు ఉంది. అలా చేసాక నేను మరొక వ్యక్తిగా మారతాను.. పాత విషయాలతో అంటకాగను. సమస్యలు నన్ను రక్షించాయి కాబట్టి నేను తప్పించుకున్నందుకు చాలా అదృష్టవంతురాలిని అనుకుంటాను.. ఈ క్షణాల్లోనే తన విషయంలో రాక్ లాగా ఉండి.. ఎమోషనల్ సపోర్ట్ అందించే వ్యక్తి తనకు అవసరమని భావిస్తానని అంది.
ఆదర్శ భాగస్వామి ఎలా ఉండాలి? అని ప్రశ్నించగా.. `నిలకడ కీలకం` అని అనన్య వ్యాఖ్యానించింది. అన్నిటికీ మించి నా స్నేహితుడిగా ఉండగలిగే వారితో స్థిరంగా ఉండగలను..ఎందుకంటే నా తల్లిదండ్రులలో నేను చూసినది అదే. మీరు ఒకరిని ప్రేమించే విధానం కాదు.. మీరు ఎవరితోనైనా పోరాడినప్పుడు ఎలా ఉంటారు? ఫైట్ ఎదురైతే ఎవరితోనైనా ప్రవర్తించే విధానం ఎలాంటిది? అనేది ముఖ్యం. పోరాట విధానాన్ని బట్టి మీరు వారి పట్ల గౌరవాన్ని కోల్పోలేరు. ఇంత జరిగాక మిమ్మల్ని తిరిగి గౌరవించవలసి ఉంటుంది.. ఎందుకంటే ప్రపంచం అక్కడే తిరుగుతుంది! అని అంది.
ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న నటిని గనుక.. నన్ను నన్నుగా అంగీకరించే.. కెరీర్‌కు మద్దతు ఇచ్చే వ్యక్తి తనకు అవసరమని అనన్య పాండే వెల్లడించింది. నన్ను అర్థం చేసుకుని, నాకు మద్దతు ఇవ్వగల వ్యక్తి కావాలి. నేను ఎలాంటి పోలికలు ఉండకూడదనుకుంటున్నాను. నేను మెరుస్తూ ఉండటం వారిని తక్కువ చేయడం కాదు. అది నాకు ఇష్టం ఉండదు.. అని అంది. అనన్య చివరిసారిగా కరణ్ జోహార్ యొక్క వెబ్ షో కాల్ మీ బేలో కనిపించింది. రెండో సీజన్ కూడా ఉంటుంది. తదుపరి ప్రాజెక్ట్ విక్రమాదిత్య మోత్వానేతో CTRL చిత్రీకరణలో ఉంది.