అనన్య పొట్టి ఫ్రాకు సొగసు చూడతరమా?
నటుడు చంకీ పాండే నటవారసురాలిగా అనన్య పాండే కెరీర్ ప్రారంభించినా కానీ తన హార్డ్ వర్క్ ప్రతిభను నమ్ముకుని పరిశ్రమలో ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.
By: Tupaki Desk | 27 Feb 2025 2:30 AM GMTనటుడు చంకీ పాండే నటవారసురాలిగా అనన్య పాండే కెరీర్ ప్రారంభించినా కానీ తన హార్డ్ వర్క్ ప్రతిభను నమ్ముకుని పరిశ్రమలో ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. `లైగర్` చిత్రంతో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను అందుకుంది. సీఆర్‌టిఎల్, కాల్ మీ బే వెబ్ సిరీస్ లలో నటిగా నిరూపించింది. అనన్య పరిణతి చెందిన నటనతో ఆకట్టుకుంది.
మరోవైపు అనన్య నిరంతర ఫోటోషూట్లు యూత్‌లో హాట్ టాపిగ్గా మారుతున్నాయి. తాజాగా వోగ్ కవర్ షూట్ నుంచి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. షార్ట్ బ్లాక్ గౌనులో థై అందాలను ఎలివేట్ చేస్తూ అనన్య ఇచ్చిన ఫోజు చూపరులను కట్టి పడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
చిన్నప్పుడు అనన్య పాండే - సుహానా ఖాన్ అమెరికాస్ నెక్స్ట్ టాప్ మోడల్ వంటి రియాలిటీ టీవీ సిరీస్‌లను కలిసి చూశారు. నేటికీ ఆ ఇద్దరూ పార్టీల్లో కలుస్తారు. నటీమణులు అయ్యాక మరింత క్లోజ్ గా మారారు. నేను నేనేనా? చాలా మారిపోయానని ప్రజలు అనుకుంటున్నారు అని తాజా ఫోటోషూట్ పై అనన్య స్వయంగా వ్యాఖ్యానించింది.
ఫోటోషూట్ల పరంగా అనన్య ప్రయోగాలకు యువతరం ఫిదా అయిపోతోంది. ఓవరాల్ గా అనన్య లుక్ కి మంచి మార్కులే పడ్డాయి.. ఈ కొత్త రూపంపై ఒక రేంజులో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. మతి పోగొడుతున్న అనన్య పొడుగు కాళ్ల సౌందర్యంపై యూత్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అనన్య పొట్టి ఫ్రాకు సొగసు చూడతరమా? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు