పిక్ టాక్ : లైగర్ బ్యూటీ క్యూట్ అందాలు
సింపుల్ ఔట్ ఫిట్‌లో లూజ్ హెయిర్ స్టైల్‌తో ముద్దుగుమ్మ అనన్య పాండే కెమెరాకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 25 Jan 2025 5:30 PM GMT2019లో స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన అనన్య పాండే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. హిందీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ప్రేక్షకులకు ఎక్కువ చేరువ అయ్యింది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఐదు ఏళ్లు కాలేదు, పట్టు మని ఐదు హిట్స్ పడలేదు. అయినా ఈ అమ్మడికి ఏకంగా 26 మిలియన్‌ల ఫాలోవర్స్ ఇన్‌స్టాలో ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ కారణంగా బాలీవుడ్‌లో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుంది.
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలతో సర్‌ప్రైజ్ చేసింది. ఎప్పుడూ స్కిన్ షో చేస్తూ, బోల్డ్‌గా కనిపిస్తూ ఉండే అనన్య పాండే అప్పుడప్పుడు క్యూట్‌గా, చీర కట్టులోనూ కనిపిస్తూ ఉంటుంది. తన అందంతో ఆకట్టుకునే అనన్య పాండే తాజా ఫోటోలు మరోసారి ఈ అమ్మడిని వార్తల్లో నిలిపాయి. ఈసారి పొడుగు కాళ్ల సుందరి అనిపించుకుంటూనే క్యూట్ బ్యూటీ అంటూ అభిమానులు, ఫాలోవర్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
సింపుల్ ఔట్ ఫిట్‌లో లూజ్ హెయిర్ స్టైల్‌తో ముద్దుగుమ్మ అనన్య పాండే కెమెరాకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్థాయి అందం మరే బాలీవుడ్ హీరోయిన్‌కి సాధ్యం కాదు అంటూ నెట్టింట ఈ అమ్మడి అందాలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి క్యూట్ అందాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్నో సార్లు స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. కానీ ఈసారి అంతకు మించి అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడి నుంచి మరిన్ని ఆకట్టుకునే ఫోటోలు వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా నిరాశ పరచినా తెలుగు లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా ఫలితంతో తెలుగు లో మళ్లీ సినిమా చేసేందుకు వెనకాడుతోంది. ఆమధ్య ఒక యంగ్ హీరోకు జోడీగా నటించేందుకు సంప్రదించిన సమయంలో సున్నితంగా తిరస్కరించిందట. టాలీవుడ్‌కి ఇప్పట్లో వచ్చేది లేదని చెప్పేసింది. ప్రస్తుతం హిందీలోనే రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఈ ఏడాదిలో మొదటగా శంకర అనే సినిమాతో రాబోతుంది.