పాండే బ్యూటీ సారీ సర్ ప్రైజ్ సంథింగ్ స్పెషల్!
నేటితరంలో స్పీడున్న భామగా అనన్య పాండే పేరు ఎంతో పాపులరైంది. నటవారసుల్లో అనన్య యూనిక్ బ్యూటీ అనిపించింది.
By: Tupaki Desk | 22 Sep 2024 10:37 AM GMTనేటితరంలో స్పీడున్న భామగా అనన్య పాండే పేరు ఎంతో పాపులరైంది. నటవారసుల్లో అనన్య యూనిక్ బ్యూటీ అనిపించింది. వరుస ఫోటోషూట్లతో అమ్మడు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటుంది. అనుభవం కొద్ది రాటు దేల్తారు అన్నట్లు అనన్య కూడా ఫ్యాషన్ వరల్డ్ లో అలాగే రాటుదేలుతోంది. ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది. ఇప్పటికే సెగలు పుట్టించే ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది.
తాజాగా ట్రెడీషనల్ దుస్తుల్లోనూ తానేం తక్కువ కాదని ప్రూవ్ చేసింది. ఇదిగో ఇక్కడిలా డిజైనర్ చీరలో అనన్యా అంతులేని అందంతో అలరించింది. ఇక్క క్షణం పాటు ఆమె అనన్యా? చూస్తున్నకళ్లు అనన్యనే చూస్తున్నాయా? అన్నంత ఆశ్చర్యానికి గురిచేసేంత అందంగా ముస్తాబైంది. షోల్డర్ లెజ్ డిజైనర్ చీరలో అనన్య అలంకరణ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటుంది.
ఓ అవార్డు ఫంక్షన్ కోసం అమ్మడు ఇలా ముస్తాబైంది. భుజాలపై వేసుకోవాల్సిన పైట కొంగును చేతులపై వేసుకుని చీర బ్యూటీలో సంథిగ్ స్పెషల్ అనిపించింది. ఇక అమ్మడు మ్యాకప్ ముస్తాబైన విధానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అలంకరణలో నాకెవ్వరూ పోటీ అన్నట్లే ముస్తాబైంది. వివిధ భంగిమల్లో అమ్మడు ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి బ్యూటీకి నెటి జనులంతా ఫిదా అవుతున్నారు. తమస్టైల్లో కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో లైగర్ ప్లాప్ అయిన అనంతరం అక్కడ ఏమాత్రం సమయం వృద్ధా చేయకుండా బాలీవుడ్ కి వెళ్లిపోయింది. లక్కీగా అవకాశాలు బాగానే అందుకుంది. ఇప్పుడిప్పుడే సక్సెస్ బ్యూటీగా పికప్ అవుతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు..మూడు సినిమాలున్నాయి.