లైగర్ ఎఫెక్ట్... నాన్న ఇక చాలు నీ సలహాలు
ఆ సినిమా కథను తన వద్దకు తీసుకు వచ్చిన తండ్రి చుంకీ పాండే పై ఇంకా ఆమెకు కోపంగానే ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 30 Nov 2024 7:30 AM GMTబాలీవుడ్ స్టార్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆమెకు కమర్షియల్ బ్రేక్ దక్కలేదు. ముఖ్యంగా అనన్య చాలా ఆశలు పెట్టుకుని నటించిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. కరణ్ జోహార్ హిందీలో సినిమాను విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా సినిమా నిర్మాణంలో ఆయన భాగస్వామిగానూ వ్యవహరించారు. అయినా లైగర్ ఫలితం ఏంటో తెలిసిందే.
అనన్య పాండే లైగర్ సినిమా చేయడం పట్ల చాలా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా కథను తన వద్దకు తీసుకు వచ్చిన తండ్రి చుంకీ పాండే పై ఇంకా ఆమెకు కోపంగానే ఉందని తెలుస్తోంది. ఇటీవల తండ్రి చుంకీ పాండేతో కలిసి ఒక టాక్ షోలో అనన్య పాండే పాల్గొంది. ఆ సమయంలో ఆమెకు చుంకీ పాండే కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. దానికి వెంటనే అనన్య కలిపించుకుని నా సినిమాల స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ గట్టిగానే చెప్పిందట. గతంలోనే నువ్వు నాకు స్క్రిప్ట్ విషయంలో సలహాలు ఇవ్వకూడదు అని చెప్పాను కదా అంది.
లైగర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో నువ్వు నాకు ఇచ్చిన సలహాలు వర్కౌట్ కాలేదు. అందుకే అప్పుడే నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పాను. తండ్రి స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఇచ్చిన సలహా కారణంగానే లైగర్ సినిమాను అనన్య పాండే ఎంపిక చేసుకుందట. పైగా కరణ్ జోహార్ సైతం ఆమెకు ఈ సినిమాను రిఫర్ చేయడం జరిగింది. కెరీర్ ఆరంభంలో సినిమాలు లేకుండా ఉన్న సమయంలో వచ్చిన పెద్ద ఆఫర్ లైగర్. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో అనన్య పాండే కి మంచి గుర్తింపు దక్కి ఉండేది, తద్వారా వరుసగా సినిమాలు వచ్చేవి. కానీ లైగర్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
అనన్య పాండే లైగర్ సినిమా విషయంలో చాలా బాధ పడుతుందని తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో తెలిసిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటుడు లేదా నటి తమ కెరీర్‌లో కొన్ని సినిమాలను ఎందుకు చేశామా అని అనుకుంటారు. అనన్య పాండే కెరీర్‌లో లైగర్ సినిమా ఆమెకు అలాంటి అభిప్రాయంను మిగిల్చింది అనే టాక్ వినిపిస్తుంది. లైగర్ సినిమా ఫ్లాప్‌తో బాలీవుడ్‌లోనూ ఈమెకు రావాల్సిన ఆఫర్లు రాలేదు, సౌత్‌లోనూ సినిమా ఛాన్స్‌లు పెద్దగా కనిపించడం లేదు. దాంతో వచ్చిన చిన్న సినిమా ఆఫర్లను సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా నిలవాలని ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది.