Begin typing your search above and press return to search.

ప్రస్తుతం మా మధ్య మాటలే లేవు

బాలీవుడ్‌ స్టార్‌ చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా కాలం అయింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 2:30 PM GMT
ప్రస్తుతం మా మధ్య మాటలే లేవు
X

బాలీవుడ్‌ స్టార్‌ చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు బిగ్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ లో ఈమె లైగర్ సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పరిచిన తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. మొదటి సినిమా నిరాశ పరచడంతో మళ్లీ టాలీవుడ్‌ లో సినిమాలు చేయడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సినిమాల గురించి కంటే అనన్య పాండే ఎక్కువగా సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోలతో పాటు, లవ్‌ వ్యవహారాల గురించి వార్తల్లో ఉంటుంది. అనన్య పాండే గత కొంత కాలంగా క్రికెటర్‌ శుభ్‌మన్ గిల్ తో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య చాలా డీప్‌ రిలేషన్‌ షిప్ కొనసాగుతుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా అనన్య పాండే ఈ విషయమై స్పందించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తాము ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది. అంతే కాకుండా తాము ప్రస్తుతం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదని చెప్పడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

అనన్య పాండే మాట్లాడుతూ... విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ లు గతంలో ఒక యాడ్‌ షూట్‌ లో కలిసి నటించి, ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మేము కలిసి ఒక యాడ్‌ లో నటించడం ద్వారా ఆ పుకార్లు మొదలు అయ్యాయి. మేము యాడ్‌ షూట్‌ లో కలిసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మా మధ్య అసలు ఎలాంటి సంబంధం లేదు. మేము రిలేషన్ లో లేము. ప్రస్తుతం మా మధ్య మాటలే లేవు. ఇద్దరం కలిసి చాలా కాలం అయింది, మేము మాట్లాడుకోవడం లేదు, అయినా రొమాన్స్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు సున్నితంగా అసహనం వ్యక్తం చేసింది.

గతంలో అనన్య పాండే, శుభ్‌మన్‌ గిల్ కలిసి యాడ్‌ లో నటించిన సమయంలోనే ప్రేమ పుకార్లు మొదలు అయ్యాయి. యాడ్‌ షూట్‌ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు వారు దూరంగా ఉంటున్నారేమో అని, ఇద్దరికి బ్రేకప్ అయ్యి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అనన్య పాండే అలా అనడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె కెరీర్‌ పై దృష్టి పెట్టాలి అనే ఉద్దేశ్యంతో ప్రేమ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందా అనే చర్చ మొదలు అయింది. మొత్తానికి అనన్య ప్రేమ విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పడింది.