Begin typing your search above and press return to search.

లైగర్ పాప 'CTRL'.. దూసుకుపోతోందిగా!

రీసెంట్ గా కాల్ మీ బే వెబ్ సిరీస్ తో మంచి ప్రశంసలు అందుకున్న అనన్య పాండే.. ఇప్పుడు కంట్రోల్ (CTRL) మూవీతో సందడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2024 12:30 AM GMT
లైగర్ పాప CTRL.. దూసుకుపోతోందిగా!
X

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బీ టౌన్ యాక్టర్ చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. జీరో సైజ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

అయితే తెలుగులోకి లైగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుందామని అనుకున్నారు. కానీ అది జరగలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఆమె యాక్ట్ చేసిన లైగర్ ను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం.. డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ఒక్క అవకాశాన్ని అందుకోలేకపోయారు. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ను మాత్రం ఓ రేంజ్ లో తన ప్రాజెక్టులతో అలరిస్తున్నారు.

రీసెంట్ గా కాల్ మీ బే వెబ్ సిరీస్ తో మంచి ప్రశంసలు అందుకున్న అనన్య పాండే.. ఇప్పుడు కంట్రోల్ (CTRL) మూవీతో సందడి చేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలకు పాపులర్ అయిన విక్రమాదిత్య మోత్వానే కంట్రోల్ కు దర్శకత్వం వహించగా.. విహాన్ సామ్రాట్ లీడ్ రోల్ పోషించారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫిక్స్ లో నిన్నటి(అక్టోబర్ 4) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న కంట్రోల్ మూవీ.. మంచి వ్యూస్ అందుకుంటోంది. ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తొలి ఐదు స్థానాల్లో ట్రెండ్ అవుతోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో కంట్రోల్ మూవీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. సినిమా బాగుందని అనేక మంది నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. మూవీ కాన్సెప్ట్ స్పెషల్ గా ఉందని చెబుతున్నారు. మంచి థ్రిల్లర్ మూవీ అని పోస్టులు పెడుతున్నారు. హీరోయిన్ అనన్య అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు. మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారని చెబుతున్నారు. అనన్య కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. అనన్య పాండే, విహాన్‍ సామ్రాట్ తో పాటు దేవికా వత్స, కామాక్షి భట్, సచిత త్రివేది, అపర్‌ శక్తి ఖురానా, సమిత్ గంభీర్, రావిష్ దేశాయ్ కీలక పాత్రలు పోషించారు. సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ బ్యానర్ పై నిఖిల్ ద్వివేది, ఆర్య మీనన్ మూవీని నిర్మించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, సోషల్ మీడియా అంశాలతో థ్రిల్లర్ మూవీగా మోత్వానే తెరకెక్కించారు.