Begin typing your search above and press return to search.

యువ క్రికెట‌ర్‌తో లైగ‌ర్ బ్యూటీ పెళ్లి?

బాలీవుడ్ యువ‌క‌థానాయిక‌ అనన్య పాండే.. హీరో ఆదిత్య రాయ్ క‌పూర్ నుంచి బ్రేక‌ప్ అయ్యాక మ‌ళ్లీ డేటింగ్ ప్రారంభించింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి

By:  Tupaki Desk   |   11 Nov 2024 3:30 PM GMT
యువ క్రికెట‌ర్‌తో లైగ‌ర్ బ్యూటీ పెళ్లి?
X

బాలీవుడ్ యువ‌క‌థానాయిక‌ అనన్య పాండే.. హీరో ఆదిత్య రాయ్ క‌పూర్ నుంచి బ్రేక‌ప్ అయ్యాక మ‌ళ్లీ డేటింగ్ ప్రారంభించింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇంత‌కుముందు భార్య నుంచి విడాకులు తీసుకున్న హార్థిక్ పాండ్యాతో అన‌న్య‌ స‌న్నిహితంగా ఉంద‌ని ప్ర‌చారం సాగింది. ఒక విదేశీ మోడ‌ల్ కు అన‌న్య క్లోజ్ అయ్యింద‌న్న పుకార్ షికార్ చేసింది. అన‌న్య‌ కొత్త డేటింగుల గురించి రోజుకో పుకార్ షికార్ చేస్తోంది. కానీ వీటికి ఆధారాల్లేవ్.

ఇప్పుడు వీట‌న్నిటికీ భిన్నంగా అన‌న్యకు పెళ్లి కూడా జ‌రిగిపోతోందంటూ ఒక‌టే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ని అన‌న్య‌ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. కొత్త సంవ‌త్స‌రానికి అడ్వాన్స్ విషెస్ చెబుతూ పెళ్లికి కూడా శుభాకాంక్ష‌లు చెప్పేస్తున్నారు కొంద‌రు ఫ్యాన్స్. ఈ పుకార్ ప్ర‌కారం.. వారి వివాహం ఫిక్స్ అయింది. త్వరలో ఇద్దరూ అధికారిక ప్రకటన చేస్తారు. అయితే ఇది నిజ‌మా? అని ఆరా తీస్తే... వారెవరూ పెళ్లి గురించిన దేనినీ ధృవీకరించలేదు. దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయ‌లేదు.

రియాన్ పరాగ్ ఇటీవలే టీమ్ ఇండియా ఆట‌గాడిగా ఆరంగేట్రం చేసాడు. అయితే భుజం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లో ఆడ‌లేక‌పోయాడు. మ‌రోవైపు అనన్య పాండేతో అతడి వివాహం జరగబోతోందనే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. ఫిబ్రవరి 2025లో పెళ్లి చేసుకోవచ్చని కూడా ఊహాగానాలు సాగిపోతున్నాయి. నెటిజ‌నుల్లో దీనిపై భారీగా చ‌ర్చ సాగుతోంది.

అయితే ఈ పుకార్లను రియాన్ లేదా అనన్య ఎవరూ ధృవీకరించలేదు. ప్రస్తుతానికి ఈ వాదనలలో నిజం లేదు. వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది కానీ ప్రస్తుతానికి అది అసంభవం అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, క్రికెటర్లు ఒక‌రితో ఒక‌రు డేటింగ్ చేయడం రొటీన్ వ్య‌వ‌హారంగా మారింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో తన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో అనన్య పాండే పేరు కనిపించడంతో క్రికెట‌ర్ రియాన్ పరాగ్ అంతకుముందు ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అతడు `అనన్య పాండే హాట్` అంటూ గూగుల్ లో శోధించాడు. దీంతో అత‌డిపై భారీ ట్రోలింగ్ జ‌రిగింది. ఆ త‌ర్వాత అన‌న్య‌ను రియాన్ ప్రేమిస్తున్నాడ‌న్న వాద‌న బ‌ల‌ప‌డింది. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్లి పుకారు పుట్టుకొచ్చింది. ఇది పూర్తిగా నిరాధారమైనది. నిజానికి ఎలాంటి వాస్తవం లేకుండా సెలబ్రిటీ సర్కిల్స్‌లో తరచూ ఇలాంటి గాసిప్‌లు చక్కర్లు కొట్ట‌డం స‌హ‌జంగా చూస్తున్న‌దే .

రియాన్ లేదా అనన్య అధికారికంగా ప్ర‌క‌టించే వరకు ఇలాంటి ప్ర‌చారాన్ని న‌మ్మ‌డం స‌రైన‌ది కాదు. ఆ ఇద్దరు ప్రస్తుతానికి తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించారు. వారి గోప్య‌త‌ను కాపాడ‌టం అభిమానుల బాధ్య‌త‌.