ఫోటో స్టోరి: తూనీగ పాండే
తాజాగా అనన్య తూనీగ వేషం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ప్యారిస్ లో ర్యాంప్ పై నడిచిన అనన్య ఒక ప్రత్యేకమైన డిజైనర్ లుక్ తో షాక్ వేవ్స్ పంపింది.
By: Tupaki Desk | 8 Feb 2024 4:06 AM GMTబాలీవుడ్ నటవారసురాళ్లలో అనన్య పాండే ప్రత్యేకత గురించి తెలిసిందే. నేటి జనరేషన్ లో స్పీడ్ ఉన్న ఫ్యాషనిస్టాగా ఇప్పటికే యూత్ గుండెల్లో నిలిచింది. లుక్ పరంగా ఈ భామ నిరంతర ప్రయోగాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా అనన్య తూనీగ వేషం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ప్యారిస్ లో ర్యాంప్ పై నడిచిన అనన్య ఒక ప్రత్యేకమైన డిజైనర్ లుక్ తో షాక్ వేవ్స్ పంపింది. ఒక అందమైన తూనీగ తన ఎద అందాలను కప్పి ఉంచే ఆ దృశ్యం ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఎంపిక చేసుకున్న డిజైన్ యూనిక్ నెస్ తో కట్టి పడేసింది. ఈ డ్రెస్ ని రూపొందించినది ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా. దీనికి స్ఫూర్తి క్రిమి కీటకాలు అని అతడు వెల్లడించాడు.
అనన్య తాజాగా తన పారిస్ ట్రిప్ నుంచి కొన్ని అద్భుతమైన ఫోటోలు, వీడియోను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. అనన్య దీనికి అందమైన క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. "ఇది అలాంటి క్షణం! పారిస్ కోచర్ వీక్‌లో రాహుల్ మిశ్రా కోసం వాకింగ్" అంటూ సీతాకోక చిలుక, ఫ్లై, తూనీగ సహా ఇతర కీటకాల ఈమోజీలను షేర్ చేసింది. మన పర్యావరణంలోని కీటకాలు సరీసృపాలతో జీవితాన్ని పంచుకోవడంలోని ఆనందం వేరు. అందరి దృష్టిని ఆకర్షించే సూపర్‌హీరోస్ (క్రిమి కీటకాలు) సేకరణ వెనుక ఉన్న ఆలోచన నాకు బాగా నచ్చింది. గ్రహం మీద మన జీవితాలను నిర్మించుకునే ప్రయత్నంలో కీటకాల ఆవాసాలను స్వాధీనం చేసుకుని వాటిని అంతరించిపోయేలా మానవాళి చేసి ఉండవచ్చు" అని వ్యాఖ్యానించింది పాండే గాళ్.
నిజానికి ఇది ఆలోచింపజేసే అద్భుతమైన థాట్. మనుషులు తమ ఇండ్లను నిర్మించుకునేందుకు పక్షులు, జంతువుల నివాసాలను కబ్జా చేస్తున్న వైనం భయపెడుతోంది. ఇక చెట్లు, అడవులను నరికి వేస్తుండడంతో అక్కడ జీవించే ఎన్నో మూగ జీవాలు, క్రిమి కీటకాల జీవనం కూడా ప్రమాదంలో పడుతోంది. ఇదే సందేశాన్ని రాహుల్ మిశ్రా తన ఫ్యాషన్ షోలో ప్రజలకు అందించారు.
కాక్ టెయిల్ 2లో ఆఫర్:
గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె 2012లో వచ్చిన హోమీ అదజానియా చిత్రం 'కాక్‌టెయిల్'తో కెరీర్ పరంగా గ్రేట్ కంబ్యాక్ ని చూపించింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా దీపికా పదుకొణెని మళ్లీ రేసులోకి తీసుకురావడమే కాకుండా నటిగా తన క్యాలిబర్‌ని నిరూపించుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు కాక్‌టెయిల్ సీక్వెల్ పనిలో ఉన్నట్లు సమాచారం. యువతరం నటీనటులు అనన్య పాండే - సారా అలీ ఖాన్ కాక్‌టెయిల్ 2 లో నటించే వీలుందని తెలిసింది. సీక్వెల్‌లను రూపొందించే ధోరణి బాలీవుడ్ లో ఇటీవల మరోసారి జోరందుకుంది. రోహిత్ ధావన్ దేశీ బాయ్జ్ 2 సహా ఇప్పటివరకు చాలా చిత్రాలు ఈ జాబితాలో చేరాయి. గురువారం సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకొనేల చిత్రం కాక్‌టెయిల్ సీక్వెల్ గురించి కూడా చాలా చర్చలు జరిగాయి.
ఇటీవల అనన్య పాండే - సారా అలీ ఖాన్ కాక్‌టెయిల్ 2 చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. కాక్‌టెయిల్ ఫ్రాంచైజ్ నిర్మాణ సంస్థ అయిన మాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ వెలుపల ఇద్దరు నటీమణులు కనిపించడంతో ఈ గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీల చిత్రం కాక్‌టెయిల్ 2012 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రం తెరపై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చూపించిన స్నేహం-ప్రేమ కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. డయానా తన సినీ జీవితాన్ని కాక్‌టెయిల్‌తో ప్రారంభించింది. రణదీప్ హుడా, డింపుల్ కపాడియా కూడా కాక్‌టెయిల్‌లో కనిపించారు.