Begin typing your search above and press return to search.

హీరోయిన్ పెద‌వులు నిజంగానే తేడాగా ఉన్నాయ్!

ఇప్పుడు అనన్య లేటెస్ట్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఫోటోలో ఏదో తేడా ఉంది. అది లిప్ ఫిల్ల‌ర్ అయ్యుంటుంది! అంటూ నెటిజ‌నులు క‌నిపెట్టేశారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 3:30 AM GMT
హీరోయిన్ పెద‌వులు నిజంగానే తేడాగా ఉన్నాయ్!
X

గ‌త కొంత కాలంగా 'లైగ‌ర్' బ్యూటీ 'ల‌వ్ బ్రేక‌ప్‌' అయిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రియుడు ఆదిత్యా రాయ్ క‌పూర్ నుంచి అన‌న్య దూరంగా ఉంటోంది. ఆ ఇద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియాల్లో అన్ ఫాలో చేసారు. జంట‌ ఫోటోల‌ను తొల‌గించారు. దీంతో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గానే అన‌న్య ర‌క‌ర‌కాల సోలో ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. వాటిపై జోకులు కూడా వేస్తోంది.

ఇప్పుడు అనన్య లేటెస్ట్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఫోటోలో ఏదో తేడా ఉంది. అది లిప్ ఫిల్ల‌ర్ అయ్యుంటుంది! అంటూ నెటిజ‌నులు క‌నిపెట్టేశారు. చాలామంది దీనిని 'పోస్ట్ బ్రేక్-అప్ గ్లో' అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే అనన్య తన తాజా ఫోటోలలో చాలా భిన్నంగా కనిపిస్తోంది. 'లైగ‌ర్' బ్యూటీ లిప్ ఫిల్ల‌ర్ల కోసం స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని ఊహాగానాలు చెల‌రేగాయి. అన‌న్య‌ కొన్ని సెల్ఫీలను షేర్ చేయ‌గా ఈ సందేహాలు మొద‌ల‌య్యాయి. దానికి త‌ను ఇచ్చిన‌ క్యాప్ష‌న్ కూడా అగ్గి రాజేసింది. ''తాజాగా కత్తిరించిన కర్టెన్ బ్యాంగ్స్, ఫేక్ ఫ్రెకిల్స్ .. నిజంగా ఎండను అనుభవిస్తున్నాను.. నేను ఒక్కటి మాత్రమే ఎంచుకోలేకపోయాను.. మీరు? '' అంటూ ఆ ఫోటోతో పాటు షేర్ చేసింది.

అయితే నెటిజనులు లైగ‌ర్ బ్యూటీ స్నేహితురాళ్ల‌తో పోలుస్తూ త‌న‌ని ఆట‌ప‌ట్టిస్తున్నారు. షానాయ కపూర్, దిశా పటానీల‌తో అన‌న్య‌ను పోలుస్తూ టీజ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇంటర్నెట్‌లో భారీ చర్చకు తెర లేపాయి. ఈ ఫోటోలు రెడ్డిట్‌లో కూడా వైరల్ కావడంతో నెటిజ‌నులు లిప్ ఫిల్లర్స్ ఉప‌యోగించినందుకు అన‌న్య‌ను నిందించారు. మరొక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. దిషా - షానయాల‌ మిశ్రమం అని ఒకరు కామెంట్ చేసారు. దీన‌ర్థం ఆ ఇద్ద‌రిలా క‌నిపిస్తోంద‌ని... ''మీకు ఫిల్లర్లు అవసరం లేదు! మీరు ఆ సహజ సౌందర్యాన్ని కలిగి ఉన్నారు!'' అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ''ఆమె అనన్య... ఫిల్టర్ దిశా వాలా హై. లిప్స్ షానాయ కే హై'' అని ఒక వ్యక్తి కామెంట్ చేసాడు. ''అది దిశాయేనా? నేను నిజంగా గందరగోళంలో ఉన్నాను..'' అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

ప‌నిలో ప‌నిగా 'అనన్య పాండే హాట్' అని క్రికెటర్ల శోధన చరిత్ర ఆన్ లైన్‌లో వైరల్ కావడంతో నెటిజ‌నులు.. అన‌న్య తాజా పోస్ట్‌లకు రిప్ల‌య్ ఇస్తూ.. రియాన్ పరాగ్! పేరును కూడా డ్రాగ్ చేస్తున్నారు. రియాన్ ప‌రాగ్ చేసిన ప‌ని సరైనదని నిరూపించడానికి అన‌న్య ఈ ఫోటోల‌ను వ‌దులుతోంద‌ని నెటిజన్లు కూడా వ్యాఖ్యానించారు. ఇది అనన్య బ్రేక్ -అప్ గ్లో అని చాలా మంది వ్యాఖ్యానించారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనన్య చివరిగా 'ఖో గయే హమ్ కహాన్'లో కనిపించింది. ఆమె మళ్లీ OTTలో 'కాల్ మీ బే'లో కనిపిస్తుంది.