అనన్య నాగల్లకి కాబోయే వాడు నానిలా ఉండాలి!
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కెరీర్ సోసోగా సాగుతోన్న సంగతి తెలిసిందే. `మల్లేషం` నుంచి మొన్నటి అన్వేషి వరకూ ఆరేడు సినిమాలు చేసింది.
By: Tupaki Desk | 27 March 2024 5:30 PM GMTతెలుగమ్మాయి అనన్య నాగళ్ల కెరీర్ సోసోగా సాగుతోన్న సంగతి తెలిసిందే. `మల్లేషం` నుంచి మొన్నటి అన్వేషి వరకూ ఆరేడు సినిమాలు చేసింది. వీటిలో పెద్ద చిత్రం `వకీల్ సాబ్`. అందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషించింది. కానీ కెరీర్ పరంగా అది పెద్దగా కలిసి రాలేదు. `మల్లేషం` ఇమేజ్ తోనే అవశాలు అందు కుంది. ప్రస్తుతం అమ్మడు `తంత్ర`..`పొట్టేలు` అనే చిత్రాల్లో నటిస్తోంది. అలా అనన్య కెరీర్ బండిని నెట్టుకొస్తుంది. సరైన ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంది కానీ ఆ సమయం రాలేదు.
మరి ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోదా? అంటే అందుకు కూడా సిద్దంగానే ఉంది. అవును ...అయితే కాబోయే వాడు విషయంలో కొన్ని ఫ్యాంటసీలు ఉన్నట్లు తెలుస్తోంది. అనన్య చేసుకునే వాడు `హాయ్ నాన్న` సినిమా లో నాని పోషించిన విరాజ్ పాత్రలా ఉండాలిట. అలాంటి వాడు తారసపడినప్పుడు అమ్మడు ఇంకేమీ ఆలోచించకుండా మూడు ముళ్లు వేయించుకుంటుందిట. అతడు గ్రీన్ ప్లాగ్ అయి ఉండాలిట.
రిలేషన్స్ షిప్స్ అంటే ఎప్పుడూ ఓ స్నేహంలా ఉండాలని..అది భార్యభర్తల మధ్య అయినా అలాంటి స్నేహం ఉండాలి అంటోంది. అప్పుడే ఆ బంధాలు కలకాలం నిలబడతాయని అభిప్రాయపడింది. మొత్తానికి అనన్య ని పెళ్లి చేసుకోవాలంటే అతడిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలని తెలుస్తోంది. మరి అలాంటి వరుడు అనన్య కోసం ఎక్కడ ఉన్నాడో? చూడాలి. ఆ జంటను కాలం కాలపాలి.
మరి అనన్య ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంటే సరైన సమాధానం రాలేదు. అన్యన్య కోరిన అబ్బాయిని పట్టుకోవడం తల్లిందండ్రులకు కూడా కష్టమైన పనే. చివరిగా అమ్మడు అలాంటి క్వాలిటీలు ఉన్న కుర్రాడి తో లవ్ లోపడే? పెళ్లి పీఠలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనన్య కెరీర్ పైనే దృష్టి పెట్టింది. నటిగా తాను పెద్ద స్థాయికి వెళ్లాలనుకుంటోంది. ఇప్పటికే గ్లామర్ పాత్రలకు సైతం సిద్దంగానే ఉన్నానంటూ గేట్తు తెరిచేసిన సంగతి తెలిసిందే.