Begin typing your search above and press return to search.

ఆ హీరో డాన్స్ కి యంగ్ బ్యూటీ ఫిదా!

ర‌ణ‌వీర్ డాన్స్ చేసిన‌ట్లు ఏ హీరో కూడా చేయ‌లేడు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయ‌న డాన్సు లో చాలా ప్ర‌త్యేక‌త‌లుంటాయి.

By:  Tupaki Desk   |   3 Aug 2023 6:23 AM GMT
ఆ హీరో డాన్స్ కి యంగ్ బ్యూటీ ఫిదా!
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'రాకీ ఔర్ రానీకి ప్రేమ్ క‌హానీ' చిత్రం ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్ చాలా కాలం త‌ర్వాత తెర‌కెక్కించిన చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో క‌ర‌ణ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. బేసిక్ గానే క‌ర‌ణ్ కి ఇండ‌స్ట్రీలోనే బోలెడంత సెల‌బ్రిటీ ఫాలోయింగ్ ఉంది. యువ నాయిక‌లంతా ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని ఆస‌క్తి చూపిస్తుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ ఈ లిస్ట్ పెద్ద‌దే ఉంది.

దీంతో తాజా చిత్రం పై అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా 'హార్ట్ త్రోబ్' అనే ప్ర‌త్యేక పాట‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ న‌టులు అన‌న్యా పాండే...జాన్వీ క‌పూర్..సారా అలీఖాన్..వ‌రుణ్ ధావ‌న్ లు ఇలా కుర్ర భామ‌లు..కుర్ర హీరోలు న‌టించారు. ఈ సంద‌ర్భంగా ఈ స‌న్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ అన‌న్య పాండే ఆస‌క్తిర పోస్ట్ చేసింది.

'నా జీవితంలో మ‌ర్చిపోలేని అద్భుత‌మైన క్ష‌ణ‌మిది. క‌ర‌ణ్ జోహార్ సినిమా పాట‌లో నేను న‌టించ‌డం ఊహించ‌లేక‌పోతున్నాను. నా సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. ఇలా క‌నిపించ‌డానికి కార‌ణం ఆయ‌నే. ఆయ‌న వ‌ల్లే నా క‌ల నిజ‌మైంది. ర‌ణ‌వీర్ తో క‌లిసి డాన్స్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ర‌ణ‌వీర్ డాన్స్ చేసిన‌ట్లు ఏ హీరో కూడా చేయ‌లేడు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయ‌న డాన్సు లో చాలా ప్ర‌త్యేక‌త‌లుంటాయి.

ఓ రిధ‌మ్ క‌నిపిస్తుంది. ప్ర‌తీ స్టెప్ లోనూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అందుకే ర‌ణ‌వీర్ ఏ పాటకి డాన్స్ చేసినా మిస్ అవ్వ‌ను . త‌ప్ప‌కుండా చూస్తాను. వీలైనంత వ‌ర‌కూ థియేట‌ర్లో ఆయ‌న డాన్సులు చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. కుద‌ర‌ని ప‌క్షం లో ఫోన్ లో అయినా త‌ప్ప‌కుండా చూస్తాను' అంది. దీన్ని బ‌ట్టి అన‌న్య పాండే - ర‌ణ‌వీర్ డాన్సుకి ఎంత వీరాభిమానో చెప్పొచ్చు. ర‌ణ‌వీర్ న‌ట‌న‌ కు అంతే ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. ఆయ‌న లో కామెడీ ని ఎంతో మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల నటుడాయ‌న‌.