Begin typing your search above and press return to search.

రూమ‌రొచ్చిన వేళ‌.. ఇంట 3 కోట్ల ఖ‌రీదుగ‌ల కార్!

హార్దిక్ పాండ్యా- న‌టాషా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇరువురు విడాకుల‌తో వేరయ్యారు.

By:  Tupaki Desk   |   23 July 2024 6:34 AM GMT
రూమ‌రొచ్చిన వేళ‌.. ఇంట 3 కోట్ల ఖ‌రీదుగ‌ల కార్!
X

హార్దిక్ పాండ్యా- న‌టాషా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇరువురు విడాకుల‌తో వేరయ్యారు. అనంత‌రం న‌టాషా త‌న సొంత దేశానికి వెళ్లిపోవ‌డం జ‌రిగింది. ఈనేప‌థ్యంలో హార్దిక్ పాండ్యా-బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే డేటింగ్ అంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. అంబానీ ఇంట పెళ్లి వేడుక‌లో జంట‌గా డాన్సు కూడా చేసారు. అలాగే ఇన్ స్టాలో ఒక‌ర్ని ఒక‌రు పాలో అవ్వ‌డం కూడా ఒకేసారి జ‌రిగింది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అన‌న్య పాండే 3 కోట్ట ఖ‌రీదుగ‌ల రేంజ్ రోవర్ కారుని కొన‌డం షాకింగ్ గా మారింది. వైట్ క‌ల‌ర్ రేంజ్ రేవ‌ర్ కొన్నది. కొత్త కారు ముందు భాగంలో పూల మాల సైతం వేసి ప్ర‌త్యేక పూజ‌లు చేసి లాంచ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అమ్మ‌డు ఆ కారు సొంత డ‌బ్బుతో కొనుగోలు చేసిందా? లేక ఎవ‌రైనా బ‌హుమ‌తిగా ఇచ్చారా? అన్న కొత్త ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో మొద‌లైంది.

అయితే ఈ రూమ‌ర్ల‌పై ఇంత‌వ‌ర‌కూ హార్దిక్ పాండ్యాగానీ, అన‌న్యా పాండే గానీ స్పందించ‌లేదు. బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం వ‌ర‌కే ప‌రిమితం. మార్చిలోనే అన‌న్యా పాండే అదిత్య రాయ్ క‌పూర్ కి బ్రేక‌ప్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు గ్రాండ్ గా స్నేహితుల్ని పిలిచి మ‌రీ బ్రేక‌ప్ పార్టీ చేసుకున్నారు. బాధ‌తో విడ‌పోవ‌డం కంటే సంతోషంగా ఎంజాయ్ చేస్తే విడిపోదాం అంటూ ఈ పార్టీ ఏర్పాటు చేసారు.

విడిపోయిన వాళ్లు ఎంజాయ్ చేసారో? లేదో కానీ వ‌చ్చిన స్నేహితులు మాత్రం పుల్ గా పార్టీనా ఎంజాయ్ చేసారు. ఇక అన‌న్య పాండే టాలీవుడ్ ప్రేక్షకుల‌కు సుప‌రిచిత‌మే. లైగ‌ర్ సినిమాతో ఇక్క‌డ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపించ‌లేదు. ముంబైకెళ్లిపోయి అక్క‌డే సినిమాలు చేసుకుంటోంది.