కుర్రాళ్లకు కంట్రోలింగ్ నేర్పిస్తుందా?
బాలీవుడ్ నటుడు చుంకీపాండే వారసురాలిగా తెరంగేట్రం చేసిన అనన్యా పాండే గురించి పరిచయం అవసరం లేదు
By: Tupaki Desk | 6 Aug 2024 4:30 PM GMTబాలీవుడ్ నటుడు చుంకీపాండే వారసురాలిగా తెరంగేట్రం చేసిన అనన్యా పాండే గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు `లైగర్` సినిమాతో టాలీవుడ్ లో నూ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ తొలి పరాజయంతోనే సొగసరి మళ్లీ ముంబైకి తిరిగెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీ అవుతుంది. ప్రస్తుతం కెరీర్ సాపీగానే సాగుతోంది. ఇటీవలే `డ్రీమ్ గర్ల్-2`, `కో గయే హమ్ కహా` తో ప్రేక్షకుల్ని అలరించింది.
త్వరలో కంట్రోల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిజంగా నియంత్రణ ఎలా ఉండాలన్నది చెప్పే ప్రయత్నం చేసింది. జీవితంలో అనుబంధాలు, ఆనందాల విషయంలో మీ మనసు మీ నియంత్రణలో ఉందని అందరూ అనుకుంటారు. కానీ ఓసారి ఆలోచించండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. కంట్రోల్ కథ వినగానే నాకెంతో నచ్చింది.
మీ జీవితంపై మీరు నిజంగా కంట్రోల్ గా ఉన్నారా? అనేది ఈసినిమా చెబుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్నిమితి మీరి వాడటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే విషయా న్నిసందే శాత్మకంగా చూపించే ప్రయత్నమిది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దాన్ని జీవితంగా మలుచుకున్న ఓ జంటను చూపిస్తున్నాం.
ఏ విషయంపట్ల అయినా యువత ఎలా కంట్రోల్ గా ఉండాలి. ఆనందం వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఏం కోరుకుంటుంది? బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటాం? మైండ్ ఎలా పనిచేస్తుంది? ఆ సమయంలో ఆలోచనలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా నియంత్రించాలి అన్నది సరదాగా చెబుతున్నాం` అంది. అక్టోబర్ 4న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని విక్రమ్ ఆదిత్యామోత్వానే తెరకెక్కిస్తున్నారు.