Begin typing your search above and press return to search.

లైగర్ బ్యూటీ తీరని కోరిక...!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు, హీరోయిన్స్‌ కి ఇతర టెక్నీషియన్స్ అందరికి డ్రీమ్‌ రోల్‌ లేదా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:20 AM GMT
లైగర్ బ్యూటీ తీరని కోరిక...!
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు, హీరోయిన్స్‌ కి ఇతర టెక్నీషియన్స్ అందరికి డ్రీమ్‌ రోల్‌ లేదా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. చాలా మంది డ్రీమ్ రోల్‌ చేయలేరు, చాలా మంది టెక్నీషియన్స్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేయకుండానే కెరీర్‌ ను ముగించిన సందర్భాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.

ఇప్పుడు అనన్య పాండే గురించిన ఆసక్తికర చర్చ జరుగుతుంది. బాలీవుడ్‌ స్టార్‌ కిడ్ అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్‌ గా తెలుగు లో లైగర్‌ చేసి ఫ్లాప్ అయినా కూడా బాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తూనే ఉండటం విశేషం.

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు తమిళ హీరో విజయ్ తో కలిసి నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గోట్‌ సినిమాను వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న విజయ్‌ ఇటీవల తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

అలాంటి విజయ్‌ తో సినిమా చేయాలని అనుకోవడం, అదే తన డ్రీమ్‌ రోల్‌ అంటూ అనన్య పాండే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో బిజీ అవ్వబోతున్న విజయ్‌ సినిమాలు ముందు ముందు చేయడం అనుమానంగానే ఉంది. కనుక అనన్య పాండే కోరిక తీరక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అనన్య పాండే లైగర్‌ సినిమాలో చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. తన అందంతో ఆకట్టుకుందని అంతా అన్నారు. అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు దక్కడం లేదు. కనుక బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. సౌత్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం విజయ్‌ వంటి సౌత్ స్టార్స్ పేర్లు ప్రస్థావిస్తుందని కొందరు అంటున్నారు.