Begin typing your search above and press return to search.

పింక్ బికినీలో లైగర్ బ్యూటీ హొయలు..!

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ లలో మెరిసే ఈ బ్యూటీ, తాజాగా బికినీలో మెరిసింది. పింక్ కలర్ బికినీలో తన అందాలను ప్రదర్శించింది

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:21 AM GMT
పింక్ బికినీలో లైగర్ బ్యూటీ హొయలు..!
X

బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటీల్లో అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతున్న ఈ బ్యూటీ, తెలుగులో లైగర్ తో అడుగుపెట్టింది. ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ మూవీ కాస్త బోల్తా కొట్టింది. దీంతో, మళ్లీ తెలుగులో కనిపించలేదు. దీంతో, ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.





కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా తన ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ లలో మెరిసే ఈ బ్యూటీ, తాజాగా బికినీలో మెరిసింది. పింక్ కలర్ బికినీలో తన అందాలను ప్రదర్శించింది. ఏదో వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ వాటర్ కనపడుతున్నాయి. లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. ఆ లోకేషన్స్ లో అనన్య అందాలు మరింత అందంగా కనపడుతుండటం విశేషం.

ఇదిలా ఉండగా, అనన్య ఈ మధ్య తన సినిమాలతో సంబంధం లేకుండా, ఓ విషయంలో వార్తల్లో నిలిచింది. అదేంటో కాదు, ఆమె ప్రేమలో పడింది. నిజానికి అనన్య బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ లో ఉంది అంటూ, చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై వీరిద్దరూ ఏనాడు స్పందించలేదు.

అయితే, తాజాగా ఆమె ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో పడటం గమనార్హం. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ బయట తిరుగుతూ కనిపించారు. ముందుగా స్పెయిన్ లో ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఫోటోలు లీక్ అయ్యాయి. వీరిద్దరూ అక్కడి ఫోటోలను వేర్వేరుగా షేర్ చేసినా, వారిద్దరూ కలిసే వెళ్లారనే విషయం బయటకు తెలిసిపోయింది.

కొంత కాలం క్రితం పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఒక చిత్రంలో ఆదిత్య రాయ్ , అనన్య పాండే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటోలు బయటకు రావడం విశేషం. వీరిద్దరి అభిమానులు ఈ ఫొటోలను చూసి వాటిని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

కాగా, ఆదిత్య, అనన్య పాండే ఒకరినొకరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారగా వీరిద్దరికి దాదాపు 13 ఏళ్ల వయసు తేడా ఉంది అంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.