కూతురి ఎఫైర్ ప్రచారం పెద్ద డ్యామేజీ అంటూ నటుడి ఆవేదన
గ్లామర్ పరిశ్రమలో ఇలాంటి పుకార్లను ఆపలేం. కానీ ఇది చాలా పెద్ద డ్యామేజ్ (కొలెటరాల్ డ్యామేజ్) అని వ్యాఖ్యానించారు చుంకీ.
By: Tupaki Desk | 5 Aug 2023 11:30 PM GMTకరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్ 7'లో అనన్య పాండే కనిపించినప్పటి నుండి తన లవ్ లైఫ్ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశమైంది. KJo నటవారసురాలు అనన్యను ఆటపట్టిస్తూ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కి మీకు మధ్య 'ఏం ఉంది?' అని ప్రశ్నించాడు. ఆ తర్వాత B-టౌన్ లో కొత్త జంట జోరుగా షికార్లు అంటూ పుకార్లు మొదలయ్యాయి.
సరికొత్త ప్రేమ పక్షులు అంటూ కామెంట్లు వేడెక్కించాయి. అదే క్రమంలో ఈ జోడీ 'ఇబిజా-ఇటలీ' వెకేషన్ నుండి రొమాంటిక్ ఫోటోలు లీకవ్వగా అవి అగ్నికి ఆజ్యం పోశాయి. పలుమార్లు జంటగా కెమెరాకి చిక్కడంతో నిప్పు లేకుండా పొగ రాదు కదా! అంటూ కామెంట్లు చేసారు. ఇప్పుడు ఈ పుకార్లపై అనన్య తండ్రి, నటుడు చుంకీ పాండే స్పందించారు.
తాజా ఇంటర్వ్యూలో చుంకీ పాండేని అనన్య డేటింగ్ పుకార్ల గురించి ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ఆ ఇద్దరి నడుమా అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు. గ్లామర్ పరిశ్రమలో ఇలాంటి పుకార్లను ఆపలేం. కానీ ఇది చాలా పెద్ద డ్యామేజ్ (కొలెటరాల్ డ్యామేజ్) అని వ్యాఖ్యానించారు చుంకీ. అనన్య పాండేతో ఏ హీరో స్క్రీన్‌పై మెరుగ్గా కనిపిస్తారని ప్రశ్నించగా టైగర్ ష్రాఫ్ పేరును ఆయన సూచించారు. ఆదిత్యా రాయ్ గురించి అతడు ఎక్కడా సూచించలేదు.
టైగర్ ష్రాఫ్ తో కెరీర్ ప్రారంభించిన అనన్య 'పతి పత్నీ ఔర్ వో'లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అనన్య నటించింది. వారు అద్భుతంగా ఉన్నారు.. ఇది తనకు గొప్ప ప్రయాణం. అదృష్టవంతురాలు.. అని మాత్రమే చుంకీ వ్యాఖ్యానించారు. నిజానికి చుంకీ పాండే కంటే ముందు అనన్య పాండే తల్లి భావన కూడా కుమార్తె డేటింగ్ పుకార్లపై స్పందించింది. తన గారాలపట్టీ ఒంటరిగా ఉందని పేర్కొంది.
నిజానికి లైగర్ చిత్రం సెట్స్ లో ఉన్న సమయంలో విజయ్ దేవరకొండతో అనన్య డేటింగ్ చేస్తోందన్న పుకార్లు కూడా షికార్ చేసాయి. కానీ కాఫీ విత్ కరణ్ సీజన్ లో కొత్త సమీకరణం బయటికి రివీలయ్యాక ఆ ఇద్దరి(అనన్య-విజయ్)పైనా గాసిప్స్ తగ్గాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనన్య తదుపరి ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డ్రీమ్ గర్ల్ 2లో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు రానుంది. తదుపరి 'ఖో గయే హమ్ కహాన్'లో సిద్ధాంత్ చతుర్వేది - ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి కనిపించనుంది.