బాడీ బిల్డర్ లా ఆ బిల్డప్ ఏంటి అమ్మడు?
అందులో అమ్మడు జిమ్ములో రెండు చేతులు పైకెత్తి...చూసారా? నా మజిల్స్ అంటూ చూపించింది.
By: Tupaki Desk | 12 Aug 2024 9:30 AM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే మంచి ఫిట్ నెస్ ప్రీక్ అన్న సంగతి తెలిసిందే. అమ్మడు ఎంతగా ఎంజాయ్ చేసినా? ఉదయం లేచే సరికి జిమ్ములో కసరత్తులు తప్పనిసరి. జిమ్ లో లేని సమయంలో యోగా, ధాన్యం అంటూ మెడిటేషన్ క్లాస్ ల్లో ఉంటుంది. ఇది అమ్మడి డైరీలో నిత్యకృత్యం. ఎంత బిజీగా ఉన్నా? పిట్ నెస్ కోసం తాను అనుసరించే రూల్ ఇది. అలాగని ఓవర్ వర్కౌట్లు చేయదు.
శరీరానికి ఎంత అవసరమో అంతవరకూ పరిమితం చేస్తుంది. అయితే తాజాగా పాండే బ్యూటీ కూడా మెలి తిరిగే కండల కోసం ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. అనన్యా పాండే తాజాగా నెట్టింట ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో అమ్మడు జిమ్ములో రెండు చేతులు పైకెత్తి...చూసారా? నా మజిల్స్ అంటూ చూపించింది. బాడీ బిల్డర్ లా నవ్వుతూ ప్రెండ్ అండ్ బ్యాక్ నుంచి ఫోజులిచ్చింది. ఇందులో బ్లాక్ ప్యాంట్..బనియన్ ధరించింది.
ఇది చూస్తుంటే సొగసరి కొత్తగా కండలపై కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. మరి కండలతో సరిపెడు తుందా? సిక్స్ ప్యాక్ ఏదైనా ట్రై చేస్తుందా? అన్నది చెప్పాలి. ఇక అనన్యా పాండే కెరీర గురించి చెప్పా ల్సిన పనిలేదు. 'లైగర్' ప్లాప్ తర్వాత మరో ఆలోచన లేకుండా బాలీవుడ్ కి వచ్చేసింది. వచ్చి రాగానే లక్కీగా అవకాశాలు అందుకుంది. వాటి విజయంతో జోరు పెంచింది.
ఇటీవలే రిలీజ్ అయిన 'బ్యాడ్ న్యూజ్' లో స్పెషల్ అప్పిరియన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నటిస్తోన్న 'సీటీఆర్ఎల్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే 'శంకర' అనే మరో సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ రెండు గాక కొన్ని కొత్త స్క్రిప్ట్ లు విని రెడీగా ఉంది.